లేడీ ఉద్యోగుల పేరిట నకిలీ ఫేస్‌బుక్, అశ్లీల ఫోటోలు పెట్టి...

తోటి మహిళా ఉద్యోగుల నకిలీ ఖాతాలు సృష్టించి వారి ప్రొఫైళ్లకు ఇంటర్నెట్ ద్వారా అశ్లీల ఫోటోలు జోడించి కంపెనీ ఉద్యోగులకు రిక్వెస్ట్ పంపించాడు. దీని పైన బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేశారు. ఇద్దరు మహిళలు వర్కర్ యూనియన్లో చురుగ్గా పని చేయడంతో వారి పైన కక్ష కట్టి వేధింపులకు పాల్పడినట్లుగా గుర్తించారు.
దంపతులను కాపాడిన పోలీసులు
ఆత్మహత్య చేసుకునేందుకు హైదరాబాద్ నడిబొడ్డున గల హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు ప్రయత్నించిన దంపతులను లేక్ పోలీసులు శనివారం రక్షించారు. మల్కాజిగిరికి చెందిన భానుప్రియ, రమేష్‌లు 2012లో పెద్దలను ఎదిరించి ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు.
అప్పటి నుండి ఉద్యోగం లేక, ఇళ్లు లేక ఆర్థిక పరమైన ఇబ్బందులతో బాధపడుతున్నారు. దీంతో నిరాశకు గురైన భార్యాభర్తలు చిల్డ్రన్ పార్కుకు వెళ్లి అక్కడ హుస్సేన సాగర్‌లో దూకేందుకు ప్రయత్నంచారు. అయితే, అది గుర్తించిన పోలీసులు వారిని కాపాడారు. కౌన్సెలింగ్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications