ఓ బాటిల్ కొడితే ఉంటుంది.. నా సామిరంగా..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీరు ప్రియులను ఒక్కచోటకు చేర్చేదే ప్రపంచ బీరు దినోత్సవం. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో మొదటి శుక్రవారం దీన్ని జరుపుకుంటారు. బీరుమీద మద్యం ప్రియులకు ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తారు. బాధ్యతాయుతమైన మద్యపానాన్ని ప్రపంచ బీరు దినోత్సవం ప్రోత్సహిస్తోంది. ఈ వేడుకలో బీరు ప్రియులంతా ఒకచోట చేరి కొత్త బీర్లను ప్రయత్నిస్తారు.
అత్యంత ప్రాచీనమైన చరిత్ర కలిగిన బీరు తాగుతూ రోజంతా ప్రజలు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. బ్రూయింగ్ లో రకరకాల బీర్లను రుచి చూస్తారు. అంతర్జాతీయంగా ఉండే బీర్ రకాలను కూడా ప్రయత్నించి చూస్తారు. కాలిఫోర్నియాలోని శాంటా క్రూజ్ లో జెస్పీ అవ్ షలోమోవ్స్ లో దీన్ని జరుపుకున్నారు. ఆగస్టు 5వ తేదీనీ మొదట్లో జరుపుకునేవారు. తర్వాత మొదటి శుక్రవారానికి మారింది. బీరును ఆస్వాదించడమే కాకుండా స్థానికంగా ఉండే బీర్ల కంపెనీలకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుందంటున్నారు బీర్ ప్రియులు.

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బీరును తక్కువ మొత్తంలో తీసుకోవడంవల్ల ఒత్తిడి తగ్గడంతోపాటు ఆందోళనను తగ్గిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మెరుగైన ఆరోగ్య స్థితికి దోహదపడుతుంది. అయితే బీరును ఎక్కువగా తీసుకోవడంవల్ల మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. కేవలం ఒక గ్లాసు బీరు తీసుకుంటేనే ఆరోగ్య ప్రయోజనాలన్నీ అందుతాయి. బీరును ఎక్కువగా తాగితే హైబీపీ, ఊబకాయం, లివర్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

ఎముకల ఆరోగ్యానికి మంచిది: ఎముకల ఆరోగ్యానికి బీర్ మంచిది. బీర్ అనేది డైటరీ సిలికాన్ మూలం. ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన ఖనిజం. మితంగా బీర్ తాగడం వల్ల ఎముకల సాంద్రత పెరగడంతోపాటు ఎముకలు పలచబడటాన్ని నిరోధిస్తుంది. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవ్చని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications