గెలుస్తామనే బలుపుతో ఓడిపోయాం, వైసీపీ చేసిందిదే : దేవినేని ఉమ

టీడీపీ నేత..మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేసారు. గత ఎన్నికల్లో అహంకారం తో గెలుస్తామనే బలుపుతో ఓడిపోయామని వ్యాఖ్యానించారు. పసుపు, కుంకుమ ఇచ్చామనే ధీమాతో ఊరేగామని చెప్పుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు కాళ్ళు గడ్డాలు పట్టుకొని గెలిచారని విశ్లేషించారు. ఎమ్మెల్యేలు అయిన తరువాత అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఇసుక పేరుతో దోచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేసారు. ఉమా వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో కలకలంగా మారాయి.

దేవినేని ఉమా 2019 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి ఓటిమి పాలయ్యారు. చంద్రబాబు ప్రభుత్వంలో కీలకమైన ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసారు. తన ఓటమి గురించి ఉమా కీలక వ్యాఖ్యలు చేసారు.
నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో తాను, సౌమ్య.. ధీమా, అహంకారం తో గెలుస్తామనే బలుపుతో ఓడిపోయమని చెప్పుకొచ్చారు. పసుపు, కుంకుమ ఇచ్చాం కదా అని వీర తిలకాలు దిద్ది ఊరేగిస్తూన్నారని ఊరేగామన్నారు. ఆ ఎన్నికల్లో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధులు కాళ్ళు గడ్డాలు పట్టుకొని గెలిచారని ఉమా వ్యాఖ్యానించారు. ఈ సారి ఎన్నికల్లో మాత్రం టీడీపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. మైలవరంలో తండ్రి కొడుకులు..అదే విధంగా నందిగామ లో వసూలు బ్రదర్స్ కొండలు గుట్టలు దోచుకున్నారని ఉమా ఆరోపించారు.

devineniuma-

ఇసుక దందాతో నందిగామ..మైలవరం..జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేలు రూ 7 కోట్ల చొప్పున పంపిస్తున్నారని దేవినేని ఉమా ఆరోపణలు చేసారు. తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని నాని నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలపైన ప్రశంసలు కురిపించారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంలో కేశినేని చేసిన వ్యాఖ్యలు స్థానిక నేతలకు ఆగ్రహం తెప్పించాయి. ఇప్పుడు నందిగామ నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం లో మాజీ ఎమ్మెల్యే సౌమ్య తో కలిసి పాల్గొన్న ఉమ ఈ కీలక వ్యాఖ్యలు చేసారు. గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకోవచ్చని సూచించారు. నందిగామ ఎమ్మెల్యే పైన ఆరోపణలు గుప్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+