జగన్ లేకపోతే..మీరింత ప్రశాంతంగా ఉండలేరు: చంద్రబాబు దిగజారారు: ఆమంచి సంచలనం..!

టీడీపీ అధినేత చంద్రబాబు పైన వైసీపీ నేత..చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సంచలన ఆరోపణలు చేసారు. వంగవీటి రంగా హత్య కేసులో చిన్న వ్యక్తికి కూడా శిక్ష పడకుంగా చంద్రబాబు మాఫీ చేసారని వ్యాఖ్యానించారు. రాజకీయంగా టీడీపీ అనే కంపెనీ పెట్టి చంద్రబాబు దోచుకున్నారంటూ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిగా జగన్ లేకపోతే..మీరింత ప్రశాంతంగా ఉండేవారు కాదంటూ ఆమంచి వ్యాఖ్యా నించారు.

టీడీపీ నేతలు చెబుతున్నట్లుగా నాగార్జున రెడ్డి జర్నలిస్టు కాదని..టీడీపీ కౌంటింగ్ ఏజెంట్ గా పని చేసారని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు వాస్తవాలు తెలిసినా.. దిగజారి వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఒక జర్నలిస్టును హత్య చేయించారని ఆరోపించారు. కరకట్ట మీద నివాసంలో చంద్రబాబు ఎలా ఉంటారని ఆమంచి ప్రశ్నించారు.

చంద్రబాబు దిగజారిపోయారు..

చంద్రబాబు దిగజారిపోయారు..

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఓడిన తరువాత మరింతగా దిగజారారని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. చీరాల నాగార్జున రెడ్డి మీద జరిగిన దాడిని ఆమంచి ఖండించారు. ఆ వ్యక్తిని జర్నలిస్టుగా చెబుతున్న చంద్రబాబు వాస్తవాలు తెలిసి కూడా ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నాగార్జున రెడ్డి జర్నలిస్టు కాదని..అతని మీద 17 కేసులు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

తాజా ఎన్నికల్లో టీడీపీ కౌంటింగ్ ఏజెంట్ గా పని చేసాడని పేర్కొన్నారు. మహిళా పోలీసు అధికారిణితో పాటుగా జేసీ మీద..అదే విధంగా తన మీద నాగార్జున రెడ్డి పోస్ట్ చేసిన సోషల్ మీడియా పోస్టింగ్ లను ఆమంచి ప్రస్తావించారు. రాష్ట్రంలో దేవుడి ఆదేశాల మేరకు పాలన సాగుతోందని.. సొంత మనుషులకు సైతం ఎక్కడా అవినీతికి అవకాశం లేకుండా జగన్ పాలన చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వంగవీటి రంగా హత్య కేసులో ఏ ఒక్కరికీ శిక్ష లేకుండా చంద్రబాబు మాఫీ చేసారని వ్యాఖ్యానించారు. అయిదేళ్ల కాల పాలనలో చంద్రబాబు రాష్ట్రంలో ఏ రంగాన్ని వదలకుండా అవినితితో ఊడ్చేసారంటూ ఆమంచి కృష్ణమోహన్ ఫైర్ అయ్యారు.

కేంద్రం నుండి లేఖలు రాయిస్తున్నారు

కేంద్రం నుండి లేఖలు రాయిస్తున్నారు

అవినీతికి ఆస్కారం లేకుండా జగన్ పాలన చేస్తుంటే చంద్రబాబు పీపీఏల విషయంలో తన మనుషుల ద్వారా కేంద్ర మంత్రి మీద ఒత్తిడి తెచ్చి లేఖలు రాయిస్తున్నారని ఆరోపించారు. పోలవరంలో అవినీతి గురించి ప్రధాని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసారు. రివర్స్ టెండరింగ్ ద్వారా 870 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. టీడీపీ నుండి బయటకు రావటానికి అనేక మంది నేతలు సిద్దంగా ఉన్నారన్నారు. మాజీ మంత్రి పుల్లారావు చిలకలూరిపేటలో ఒక విలేకరిని హత్య చేయించారని ఆరోపించారు.

చంద్రబాబు అందులో ఎలా నివాసం ఉంటున్నారని

చంద్రబాబు అందులో ఎలా నివాసం ఉంటున్నారని

టీడీపీ అనే కంపెనీ పేరుతో చంద్రబాబు దోచుకున్నారని మండిపడ్డారు. అసలు కరకట్ట నివాసం అక్రమమని తెలిసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అందులో ఎలా నివాసం ఉంటున్నారని ఆమంచి కృష్ణమోహన్ ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రిగా లేకపోతే..వీరంతా ఇంత ప్రశాంతంగా తిరిగే వారు కాదని పత్తికొండలో జరిగిన నారాయణ రెడ్డి హత్య కేసును ఆమంచి కృష్ణమోహన్ గుర్తు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+