లగడపాటి రీ ఎంట్రీ, కీలక భేటీ - పార్టీ, స్థానం ఖరారు..!?
ఆంధ్రా ఆక్టోపస్‌గా చెప్పుకొనే లగడపాటి కీలక అడుగులు వేస్తున్నారు. రాజకీయంగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దం అవుతోంది. దీనికి సంబంధించి పూర్తి స్కెచ్ సిద్దం అయినట్లు సమాచారం. అందులో భాగంగా తొలిగా అనుచరుల ఆత్మీయ సమావేశం జరిగంది. త్వరలోనే లగడపాటి తన నిర్ణయం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఇదే సమయంలో లగడపాటి కొత్తగా ఎంట్రీ ఇచ్చే పార్టీ..పోటీ చేసే స్థానం
పైనా నిర్ణయం జరిగిందని సమాచారం.
ఆక్టోపస్ రీ ఎంట్రీ : మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తిరిగి రాజకీయంగా కీ రోల్ కు సిద్దం అవుతున్నారు. వచ్చే ఎన్నికలు రాజకీయంగా మూడు పార్టీలకు కీలకం కానున్నాయి. ఈ సమయంలో లగడపాటి రీ ఎంట్రీ ఆసక్తిని పెంచుతోంది. లగడపాటి విజయవాడ ఎంపీగా పోటీ చేయించాలన్న ఉద్దేశంతో నగరంలోని ఒక హోటల్‌లో ఆయన ముఖ్య అనుచరులు కొందరు రహస్య సమాలోచనలు చేశారు 2014లో ఉమ్మడి రాష్ట్రం విడిపోవడానికి ముందు రాజగోపాల్ సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్రం విడిపోదని, విడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. రాష్ట్రం విడిపోవడంతో ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

అనుచరుల కీలక భేటీ : తన సర్వేలతోనూ లగడపాటి సంచలనంగా మారారు. కానీ, 2019 ఎన్నికల సమయంలో ముందస్తు ఎన్నికల ఫలితాలను ప్రకటించారు.అయితే ఫలితాలు వచ్చిన తరువాత ఆయన అంచనాలు తప్పా యి. అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఆయన్ను ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దింపాలని అనుచరులు కోరుతున్నారు. త్వరలో పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. లగడపాటి ఏ పార్టీలో ఉన్నా అభ్యంతరం లేదని ఆయనతో పాటే తామంతా అని నేతలు పేర్కొన్నట్లు సమాచారం. అయితే, లగడపాటి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్ లో ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచే పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది.
ఎన్నికల బరిలో ఖాయమా : ఇదే సమయంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో ఉండటం..ఆయనతో ఉన్న సంబంధాలతో, తమ పార్టీలోకి రావాలని..విజయవాడ నుంచి పోటీ చేయాలనే సూచనలు అందాయని సమాచారం. దీంతో, పాత్తుల లెక్కల తరువాతనే అధికారికంగా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. అటు వైసీపీలోనూ లగడపాటికి సన్నిహితులు ఉన్నారు. కానీ, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత లగడపాటి నాటి సీఎం చంద్రబాబుతో సన్నిహితంగా వ్యవహరించారు. దీంతో, ప్రచారం సాగుతున్నట్లుగా లగడపాటి పొలిటికల్ రీ ఎంట్రీ టీడీపీతో ఉంటుందా..ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు.. ఎటువంటి నిర్ణయం ప్రకటించబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications