ఏపీలో కొత్త బార్లు - ఫీజులు, మద్యం ధరలు ఫిక్స్..!!

ఏపీలో మద్యం విధానం లో భాగంగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నూతన మద్యం పాలసీ అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త గా మద్యం దుకాణాలు మొదలయ్యాయి. మద్యం బ్రాండ్లతో పాటుగా ధరల పైన ప్రభుత్వం మార్గ దర్శకాలు జారీ చేసింది. ఇక, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 53 బార్ లైసెన్సుల జారీకి అబ్కారీ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫీజులను వెల్లడించింది.

తాజా నోటిఫికేషన్
ఏపీలో కొత్తగా బార్ల లైసెన్సుల జారీకి ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బార్ల ఏర్పాటు కు నోటిఫికేషన్ జారీ చేసింది. ఏడాది కాల పరిమితి నిర్దారించింది. 2024 డిసెంబరు 1 నుంచి 2025 ఆగస్టు 31 తేదీ వరకూ 53 బార్​ల లైసెన్సుల జారీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ-వేలం, ఆన్ లైన్ లాటరీ విధానంలో బార్​లను ఎక్సైజ్ శాఖ కేటాయించనున్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించారు. ఈ నెల 22వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ కు అనుమతించనున్నారు. అదే విధంగా జనాభా ప్రాతిపదికన బార్లకు లైసెన్సు ఫీజు ఖరారు చేసారు.

Excise issues re notification for 53 Bar licenses finalised the fee and guidelines

ఫీజు - మార్గదర్శకాలు
ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు 50 వేల జనాభా వరకూ రూ.5 లక్షల నాన్ రిఫండ బుల్ దరఖాస్తు రుసుముగా నిర్ణయించారు. అదే విధంగా 50 వేల నుంచి 5 లక్షల లోపు జనాభా వరకూ ఉన్న ప్రాంతాలకు రూ.7.5 లక్షల దరఖాస్తు రుసుముగా ఖరారు చేసారు. ఇక, 5 లక్షల పైచిలుకు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.10 లక్షల దరఖాస్తు రుసుముగా వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలు ఏర్పాటు అయ్యాయి. అదే సమయంలో బ్రాండెడ్ మద్యం అమ్మకాలు తిరిగి కొనసాగుతున్నాయి. ధరల విషయంలోనూ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.

అధికారుల నిఘా
మద్యం దుకాణాల్లో ఎక్కడైనా ఎమ్మార్పీ కంటే అధికంగా ఎవరైనా వసూలు చేస్తే వారికి జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎంఆర్​పీకి మించి మద్యం అమ్మకాలు జరిపినట్లు రుజువైతే మొదటి సారి అయితే రూ.5 లక్షలు ఫైన్ వేయాలని స్పష్టం చేసింది. ఆ తరువాత కూడా నిర్దేశిత ధరల కంటే ఎక్కువ రేటుకు అమ్మకాలు చేస్తే ఆ దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మద్యం షాపుల యజమానులు ఎవరైనా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తే వారి పైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. దీంతో, ఎక్సైజ్ అధికారులు వీటి పైన నిఘా పెట్టారు. ఇక, ఇప్పుడు బార్లకు నోటిఫికేషన్ జారీ కావటంలో ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+