దారుణం: వివాహేతర బంధానికి ఒప్పుకోలేదని ఇంటికి నిప్పుపెట్టాడు
తనతో అక్రమ సంబంధానికి ఒప్పు కోలేదనే కోపంతో ఓ వ్యక్తి సదరు మహిళ ఇంటికి నిప్పుపెట్టాడు.
కృష్ణా: జిల్లాలోని నూజివీడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనతో అక్రమ సంబంధానికి ఒప్పు కోలేదనే కోపంతో ఓ వ్యక్తి సదరు మహిళ ఇంటికి నిప్పుపెట్టాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బాపూనగర్ రోడ్డులో నివాసముంటున్న ఓ మహిళ భర్తను వదిలేసింది.
ఓ ప్రభుత్వ సంస్థలో హౌస్ కీపర్‌గా పని చేస్తూ.. తల్లి, కూతురుతో కలిసి జీవనం సాగిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన తలారి రవి.. తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని కొంత కాలంగా ఆమెను వేధిస్తున్నాడు. రవికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండటం గమనార్హం.

కాగా, శనివారం రాత్రి బాధిత మహిళ తనకూతురుతో కలిసి గాంధీనగర్‌లోని తెలిసిన వారి ఇంటికి వెళ్లారు. ఇది గమనించిన రవి.. తన కోరిక తీర్చలేదనే అక్కసుతో ఆదివారం తెల్లవారుజాము 2 గంటల ప్రాంతంలో సదరు మహిళ ఇంటికి వెళ్లాడు. తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. ఇనుప బీరువాను ధ్వంసం చేశాడు. అందులోని రూ.20 వేల నగదు, నాలుగు కాసుల బంగారం దొంగిలించాడు. లోపలి సామానుపై పెట్రోలు పోసి నిప్పంటించి అక్కడ్నుంచి పరారయ్యాడు.
గమనించిన స్థానికులు సాయం కోసం కేకలు వేశారు. చుట్టు పక్కలవారు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే ఇంట్లోని రెండు సిలిండర్లు పేలకపోవడంతో పెద్ద నష్టమే తప్పింది. కాగా, దీనిపై రవిని అనుమానించిన చుట్టుపక్కల మహిళలు ఆదివారం అతడ్ని చెట్టుకు కట్టేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications