వెలుగులోకి అఘోర బాబా రాసలీలలు.. ఆటగాడే !
భక్తి పేరుతో అమ్మాయిలను లొంగదీసుకునే దొంగ బాబాల అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. ఎంత మంది దొంగ బాబాలకు శిక్షలు పడుతున్నా.. కొంతమంది ఇంకా దారికి రావడం లేదు. ఎక్కడో ఒక చోట దొంగ బాబాలు పుట్టుకొస్తూనే ఉన్నారు. రోజుకో బాబా లీలలు వెలుగు చూస్తున్నాయి. భక్తి పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న మరో బాగోతం బయటపడడం హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా ఓ దొంగ అఘోర బాబా రాసలీలలు బయటికి వచ్చాయి. అఘోర పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న అతని పేరు రాజేష్ నాథ్ గా తెలుస్తోంది. తాజాగా అతను ఇద్దరు అమ్మాయిలతో అసభ్యకర చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఒక రూమ్ బుక్ చేశాను ముగ్గురం కలిసి కోరిక తీర్చుకుందామని చాటింగ్లో పేర్కొన్నాడు. అయితే ఓ అమ్మాయి తన వ్యక్తిగత సమస్యలతో 2024 ఏప్రిల్ లో రాజేష్ నాథ్ వద్దకు వెళ్లింది. తన సమస్యలు చెప్పుకోని పరిష్కారం చెప్పమంటే.. నీ సమస్యలన్నీ తీరుస్తానని ఏప్రిల్ 20 నుంచి బాధితురాలితో రాజేష్ నాథ్ చాటింగ్ చేయడం ప్రారంభించాడు.

ఈ క్రమంలోనే ఆ అమ్మాయి లైంగిక జీవితం గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఒక న్యూడ్ వీడియో పంపి ఇలా చేయాలంటూ కూడా అసభ్యంగా చాట్ చేశాడు. తనకు జరిగిన అన్యాయంపై తాజాగా సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది బాధితురాలు. అఘోర బాబా రాజేష్ నాథ్ తనతో చేసిన చాట్ మొత్తాన్ని బయటపెట్టింది. రాజేష్ నాథ్ ని తనలా ఎవరూ మోసపోవద్దంటూ పేర్కొంది. చాలా మంది అమాయక అమ్మాయిలను ట్రాప్ చేశాడని.. అందరినీ రాజేష్ నాథ్ బారి నుంచి కాపాడాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అఘోర పీఠం పేరుతో కోట్లు దండుకుంటున్నాడని బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications