Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యాగం పేరుతో కోట్లు వసూలు చేసిన బాబా...నిలదీసినందుకు ఆత్మహత్యాయత్నం...

నెల్లూరు: భక్తి ముసుగులో మరో దొంగ బాబా భక్తులకు భారీగా టోకరా వేశాడు. ఆశ్రమంలో యాగం నిర్వహిస్తున్నానంటూ ఈ బాబా తన అనుచరుల ద్వారా భక్తుల నుంచి కోట్లు వసూళ్లు చేయించాడు.

యాగ నిర్వహణకు డబ్బులు ఇస్తే ఆ తర్వాత అంతకు రెట్టింపు ధనం ఇస్తామంటూ బాబా అనుచరులుగా చెప్పుకున్న ఓ జంట భక్తుల నుంచి కోట్లాది రూపాయలు వసూళ్లు చేశారు. అయితే ఆ తరువాత వారు కనిపించకుండా పోవడంతో భక్తులు బాబాను నిలదీశారు. దీంతో అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు. నెల్లూరు నగరంలో చోటుచేసుకున్నఈ ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే...

బురిడీ బాబా...మోసానికి నాంది ఇలా...

బురిడీ బాబా...మోసానికి నాంది ఇలా...

నెల్లూరు ప్రశాంతినగర్‌లో సుధాకర్‌బాబా అనే వ్యక్తి గురుదత్తాత్రేయ ఆశ్రమాన్నినిర్వహిస్తున్నాడు. ఈ బాబా ఇటీవల 105 రోజుల పాటు నవనాద సంప్రదాయ శ్రీ గురుదత్తాత్రేయ మహామంత్ర ఇష్టకామ్య మహాయాగం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

రంగంలోకి దిగిన ఓ జంట...నమ్మబలికారు...

రంగంలోకి దిగిన ఓ జంట...నమ్మబలికారు...

దీంతో ఈ యాగం ఏర్పాట్లు కోసమంటూ మరో జిల్లాకు చెందిన ఒక జంట తమ కుటుంబ సభ్యులతో ఆశ్రమానికి చేరుకుంది. ఈ క్రమంలో భక్తులకు ఆ దంపతులు యాగానికి సంబంధించిన ప్రత్యేక పుస్తకాలను పంపిణీ చేస్తూ...తాము చెప్పినట్లు చేస్తే ఈ యాగం అనంతరం పెద్ద ఎత్తున ధనం సమకూరుతుందని వారు నమ్మబలికారు.

డబ్బులిచ్చి...పుస్తకాలు కొన్నారు...

డబ్బులిచ్చి...పుస్తకాలు కొన్నారు...

దీంతో భక్తులు ఈ బాబాపై తమకు ఉన్న నమ్మకంతో ఒక్కొక్కరూ రూ. 50 వేల చెల్లించి ఆ దంపతులు, వారి కుటుంబ సభ్యుల నుంచి యాగానికి సంబంధించిన పుస్తకాలను కొనుగోలు చేశారు. వారు పుస్తకాలు భక్తులకు ఇస్తూ తాము చెప్పిన విధంగా చేసి సూచించిన మంత్రాన్ని ఆ పుస్తకంలో రాస్తే ఒక్కో పుస్తకానికి రూ.2 వేల చొప్పున తిరిగి ఇస్తామని, తద్వారా ఎన్నో రెట్ల ధనం మీకు సమకూరుతుందని నమ్మబలికారు. దీంతో కొందరు భక్తులు భారీ సంఖ్యలో పుస్తకాలను కొనుగోళ్లు చేయగా, ఈ విషయం తెలిసి మరింతమంది భక్తులు ఆశ్రమానికి తరలివచ్చి పుస్తకాలను కొనుగోలు చేశారంటున్నారు.

జంట మాయం...బాబా నిలదీత...ఆత్మహత్యాయత్నం

జంట మాయం...బాబా నిలదీత...ఆత్మహత్యాయత్నం

దీంతో ఈ పుస్తకాల విక్రయాల ద్వారా ఆ జంట రూ.3 కోట్లుకు పైగానే వసూలు చేసినట్లు అంచనా వేస్తున్నారు. అయితే యాగం సమీపిస్తుండగా ఆ దంపతులు, వారి బృందం కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన భక్తులు సుధాకర్‌ బాబాను ఈ విషయమై నిలదీశారు. అయితే బాబా తనకు ఈ వ్యవహారంతో సంబంధం లేదనడంతో భక్తులు ఆందోళనకు దిగి ఆయనతో వాగ్వాదానికి దిగారు. దీంతో బాబా ఆత్మహత్యాయత్నం చేయడంతో కలకలం రేగింది. అయితే యాగం పేరిట ఈ మోసం జరిగినప్పటికి బాబాకు ఇందులో ప్రమేయం ఉందా?...లేక...బాబా కూడా మోసపోయారా? అనేది విచారణ జరిపితే తేలే అవకాశం ఉంది. అయితే ఈ విషయమై ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+