'గోపాల గోపాల' అపశృతులు: పవన్ ఫ్యాన్ గొంతు కోసిన దుండగులు
న్యూఢిల్లీ: 'గోపాల గోపాల' ఆడియో ఫంక్షన్ వద్ద అపశృతులు చోటు చేసుకున్నాయి. కొందరు దుండగులు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని గొంతు కోసి పారిపోయారు. శిల్పకళావేదిక గేటు నెంబర్ 1 వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లాకు చెందిన పవన్ కల్యాణ్ అభిమాని కన్నా శ్రీనివాస్ వచ్చారు. శ్రీనివాస్ శిల్పకళావేదిక గేటు నెంబర్ 1 వద్ద రాగానే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతని గొంతు కోసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అతనిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

ఇదిలా వుంటే, మరో అపశ్రుతి కూడా చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ కారు ఢీకొని బౌన్సర్ కాలు విరిగింది. శిల్ప కళావేదికలో ఆదివారం గోపాల గోపాల ఆడియో విడుదల కార్యక్రమం ఏర్పాటైంది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తో పాటు వెంకటేష్ కూడా వచ్చారు. ఈ సినిమాలో వారిద్దరు నటించడం విశేషం.
ఈ సినిమాలో పవన్ కోసం ఓ బైక్‌ను అమెరికా నుంచి దిగుమతి చేశారు. అన్ని పనులు పూర్తిచేసి ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. మిగతా ముఖ్య పాత్రల్లో మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్, పృథ్వి, దీక్షాపంత్, నర్రా శీను తదితరులు నటించారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications