పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..! అలా చేస్తే అభిమానులు నన్ను ముక్కలు చేస్తారు..!
అమరావతి/హైదరామాద్ : ఆచి తూచి మాట్లాడే జనసేన అధినేత పవన్ కల్యాణ్ నియంత్రణ కోల్పోయారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో రాజమండ్రికి చెందిన పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వైసీపి అధినేత జగన్ పై ఆసక్తిక చర్చ మొదలైంది. అదికూడా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నోటి వెంట ఆ మాటలు రావడం ఉత్కంఠ రేపుతున్నాయి.
Recommended Video

జగన్ పై కేసులు కనుక లేకపోతే, ఆయన తిరిగే వారు కాదని, కూర్చునే రాజకీయం చేసేవారని అభిప్రాయపడ్డారు జనసేనాని. ప్రధాని మోదీ సంవత్సరం అంతా తిరుగుతున్నారని చెప్పిన పవన్, చంద్రబాబు, లోకేశ్ లు తిరుగుతున్నారా? వీళ్లెవరూ తిరగరని విమర్శించారు. ప్రజల మధ్య నాయకులు ఉండాలని, ప్రతిరోజూ ప్రజలను కలిసేందుకు తిరగాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ ను సీఎం చేయాలని నాడు ఎక్కువ మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరుకున్నారని, అలా జరగలేదు కనుక జగన్ రోడ్లపై తిరిగి కష్టపడ్డారని, ఆ కష్టాన్ని తానేమీ కాదనడం లేదని గబ్బర్ సింగ్ అన్నారు. 'నేను కూడా రోడ్లపై తిరిగేందుకు సిద్ధంగా ఉన్నాను. కానీ, అభిమానులు నన్ను తిరగనిస్తారా'? అని కాటమ రాయుడు ప్రశ్నించారు.
తన చొక్కానే కాదు, తన శరీరాన్నీ ముక్కలు ముక్కలుగా అభిమానులు పీక్కుపోతారని వ్యాఖ్యానించారు. వచ్చే ప్రజలను, అభిమానులను అదుపు చేయలేక తన సెక్యూరిటీ అలసిపోతారని అన్నారు. 'రోడ్లపైకి నేను రావాలంటే ఇన్ని ఆలోచించాలి. అలా అని నేను రాకుండా ఉండను' అని స్పష్టం చేశారు. తాజాగా పవన్, సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలపై అమరావతిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
-
'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్ షో టైమ్ లీక్.. ఇక రచ్చ రచ్చే.. -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
"ఉస్తాద్ భగత్ సింగ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్‌లో వాహనదారులకు పోలీసుల అలర్ట్ ! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
అమరావతిలో తొలి భారీశిల్పం,చారిత్రక స్మారకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
రాజమండ్రి పరిసరాల్లో "పెద్ద పులి".. హనుమాన్ బృందాలకు పవన్ కీలక ఆదేశాలు !! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !!












Click it and Unblock the Notifications