ఎమ్మెల్యే చంద్రావతి వాహనంపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
ఖమ్మం: వైరా సిట్టింగ్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రావతి కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగి. జిల్లాలోని కొణిజర్ల మండలం తుమ్మలపల్లిలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. తుమ్మలపల్లికి చెందిన కొందరు కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు.
కాన్వాయ్‌కి ఉన్న జెండాలను తొలగించిన దుండగులు, ఎమ్మెల్యే చంద్రావతిని దూషించారు. అంతేగాక అడ్డుకోబోయిన గన్‌మెన్ నాగరాజుపై దాడికి దిగారు. దీంతో అతనికి గాయాలయ్యాయి. దాడి ఘటనపై ఎమ్మెల్యే చంద్రవాతి కొణిజర్ల పోలీస్ స్టేసన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై సిపిఐ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇది ఇలా ఉండగా కొణిజర్ల మండలం కొండవనమాలలో సిపిఎం, సిపిఎం కార్యకర్తల మధ్య ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడికి దిగారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘర్షణలో నలుగురు కార్యకర్తలు, శుక్రవారం ఉదయం జరిగిన ఘర్షణలో ఆరుగురు కార్యకర్తలు గాయపడ్డారు. ఆందోళనకారులు రెండు బైక్‌లు దగ్ధం చేశారు.












Click it and Unblock the Notifications