AP Budget : రూ.2.79 లక్షల కోట్లతో ఏపీ బడ్డెట్-సంక్షేమమే టాప్-ఆ తర్వాత కీలక కేటాయింపులు ఇలా..
ఏపీ అసెంబ్లీలో 2023-24 ఆర్ధిక సంవత్సరానికి వార్షిక బడ్డెట్ ను ప్రవేశపెట్టిన ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. తన ప్రసంగంలో రవీంద్రనాథ్ ఠాగూర్ తో పాటు పలువురి వ్యాఖ్యల్ని ప్రస్తావించారు.
అమరావతి : ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2023-24 ఆర్ధిక సంవత్సరానికి బడ్డెట్ ను ప్రవేశపెట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎన్నడూ లేనంత స్ధాయిలో రూ.2.79 లక్షల కోట్లతో ఈ బడ్డెట్ ను బుగ్గన ప్రవేశపెట్టారు. ఇందులో ఎప్పటిలాగే విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు.

ఏపీలో 2.79 లక్షల కోట్ల బడ్డెట్
ఏపీలో వచ్చే ఆర్ధిక సంవత్సరానికి వైసీపీ సర్కార్ 2.79 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించింది. ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇవాళ అసెంబ్లీలో రూ.2 లక్షల 79 వేల 279 కోట్లతో బడ్డెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో గతంలోలాగనే పలు కీలక రంగాలకు కేటాయింపులు భారీగా చేశారు. ఇందులో విద్య, వైద్య, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాల పథకాలకు భారీ కేటాయింపులే చేశారు. గతంతో పోలిస్తే ప్రతీ శాఖకూ కే్టాయింపులు పెంచారు.

బడ్డెట్ పై సంక్షేమ ముద్ర
2023-24 బడ్జెట్‌లో కేటాయింపులు చూస్తే.. వైయస్ఆర్ పెన్షన్ కానుకకు రూ.21,434.72 కోట్లు, వైఎస్ఆర్ రైతు భరోసాకు రూ.4,020 కోట్లు, జగనన్న విద్యా దీవెనకు రూ.2,841.64 కోట్లు, జగనన్న వసతి దీవెనకు రూ.2,200 కోట్లు, వైయస్‌ఆర్-పీఎం బీమా యోజనకు రూ.1600 కోట్లు, డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు, రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు కేటాయించారు. వైయస్ఆర్ కాపు నేస్తానికి రూ.550 కోట్లు ఇచ్చారు. జగనన్న చేదోడు రూ.350 కోట్లు
వైయస్‌ఆర్ వాహనమిత్ర రూ.275 కోట్లు, వైయస్‌ఆర్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు, వైయస్ఆర్ మత్స్యకార భరోసా రూ.125 కోట్లు, మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.50 కోట్లు, రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్లు, లా నేస్తం రూ.17 కోట్లు
జగనన్న తోడు రూ.35 కోట్లు, ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు, వైయస్‌ఆర్ కల్యాణమస్తు రూ.200 కోట్లు, వైయస్ఆర్ ఆసరా రూ.6700 కోట్లు, వైయస్ఆర్ చేయూత రూ.5000 కోట్లు, అమ్మ ఒడి రూ.6500 కోట్లు కేటాయించారు. ఈ లెక్కన మొత్తంగా ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలకు రూ.54,228.36 కోట్లు కేటాయించినట్లయింది.

కీలక రంగాలకు కేటాయింపులు ఇలా..
ధరల స్థిరీకరణ నిధికి రూ.3,000 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణ రూ.1,212 కోట్లు, వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం రూ.15,882 కోట్లు కేటాయించారు. అలాగే మన బడి నాడు-నేడు రూ.3,500 కోట్లు, జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు
పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.15,873 కోట్లు, పురపాలక, పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు, స్కిల్ డెవలప్‌మెంట్ రూ.1,166 కోట్లు, యువజన అభివృద్ధి, పర్యాటకం, సాంస్కృతిక శాఖ రూ.1,291 కోట్లు, షెడ్యూల్ కులాల కాంపొనెంట్ కోసం రూ.20,005 కోట్లు, షెడ్యూల్ తెగల కాంపొనెంట్ కోసం రూ.6,929 కోట్లు ఇచ్చారు. వెనుకబడిన తరగతుల కాంపొనెంట్ కోసం రూ.38,605 కోట్లు, కాపు సంక్షేమం రూ.4,887 కోట్లు, మైనార్టీల సంక్షేమం రూ.4,203 కోట్లు, పేదలు అందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్యం రూ.2,602 కోట్లు, రోడ్లు, భవనాల శాఖకు రూ.9,118 కోట్లు, నీటి వనరుల అభివృద్ధికి (ఇరిగేషన్) రూ.11,908 కోట్లు కేటాయించారు. పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ రూ.685 కోట్లు
ఎనర్జీ రూ.6,456 కోట్లు, గ్రామ, వార్డు సచివాలయ శాఖకి రూ.3,858 కోట్లు, గడప గడపకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు కేటాయించారు.
-
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది?












Click it and Unblock the Notifications