ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.500 కోట్లు ఆస్తి నష్టం !!
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సింగరాయకొండ సమీపంలోని బిట్రగుంట గ్రామం వద్ద ఉన్న బీకేటీ (BKT) పొగాకు పరిశ్రమలో ఈరోజు ( అక్టోబర్ 10, 2025 )తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ప్రమాదంలో దాదాపు రూ.500 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ అనూహ్య ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. ఇంతటి స్థాయిలో భారీ నష్టం జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్..
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. క్షణాల్లోనే మంటలు పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. గోదాంలో నిల్వ ఉన్న పొగాకు బేళ్లు, ప్యాకేజింగ్ మెటీరియల్, యంత్రాలు, కెమికల్స్.. అగ్నికి ఆహుతయ్యాయి. బీకేటీ సంస్థ వద్ద జీపీఐ కంపెనీ అద్దెకు తీసుకుని ఈ పరిశ్రమను నడుపుతోంది. పొగాకు ప్రాసెసింగ్‌లో ఉపయోగించే రసాయనాల కారణంగానే మంటలు వేగంగా వ్యాపించాయని భావిస్తున్నారు. దట్టమైన పొగ మొత్తం ప్రాంతాన్ని కమ్మేసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

కాగా ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఒంగోలు, సింగరాయకొండ, టంగుటూరు, కందుకూరు ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. దాదాపు ఐదు గంటలపాటు సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల వేడి, పొగ కారణంగా రక్షణ చర్యలకు పెద్ద సవాలు ఎదురయ్యింది.
ఈ ప్రమాదంలో దాదాపు రూ.500 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తుండగా.. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం కాస్త ఊరట కలిగిస్తోంది. పొగాకు బేళ్లు, యంత్రాలు, ప్రాసెసింగ్ సామగ్రి, ఎగుమతుల కోసం సిద్ధం చేసిన ఉత్పత్తులు పూర్తిగా కాలిపోయాయి. ఘటనాస్థలాన్ని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సింగరాయకొండ సీఐ సతీష్ రెడ్డి, ఫైర్ ఆఫీసర్లు పరిశీలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేక రసాయనాల రియాక్షన్ అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో పొగాకు పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై మళ్లీ చర్చ మొదలైంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications