Can't defeat him, destroy him: సోనియా గాంధీ ఫస్ట్ లుక్..అవుట్

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంపై తెరకెక్కుతున్న మూవీ.. యాత్ర 2 (Yatra 2). మహీ వీ రాఘవ్ దర్శకుడు. 2019లో విడుదలైన యాత్రకు ఇది సీక్వెల్‌. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ యాత్ర అప్పట్లో రాజకీయంగా సంచలనం రేపింది.

వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి జీవించారు. రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు, వైఎస్సార్ ఆత్మగా చెప్పుకొనే కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు గౌరు చరిత క్యారెక్టర్‌లో అనసూయ.. కీలక పాత్రల్లో నటించారు. 2019 ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర విడుదలైన ఈ సినిమా అప్పట్లో పొలిటికల్ సెన్సేషన్‌గా మారింది.

First look of the Sonia Gandhis character in Yatra 2 movie is out

ఇప్పుడా సినిమాకు సీక్వెల్ సిద్ధమౌతోంది. ప్రస్తుతం సెట్స్‌పై ఉందా మూవీ. వైఎస్ జగన్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తోన్నారు. ఇందులో కూడా వైఎస్సార్ క్యారెక్టర్ ఉంది. మమ్ముట్టే ఆ పాత్రను పోషిస్తోన్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది ఈ మూవీ. కడప జిల్లాలోని పులివెందుల, ప్రొద్దుటూరుల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు దర్శకుడు.

2024 ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర 2 రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని గ్లింప్సెస్ విడుదలయ్యాయి. టైటిల్ అనౌన్స్‌మెంట్, మోషన్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. యాత్ర తరహాలోనే ఇది కూడా బిగ్గెస్ట్ హిట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

ఈ సినిమాలో సోనియా గాంధీ పాత్రను కూడా ఇంట్రడ్యూస్ చేయనున్నారు దర్శకుడు మహీ వీ రాఘవ్. సోనియా గాంధీ పాత్ర ఫస్ట్ లుక్‌‌ను కొద్దిసేపటి కిందటే ఆయన విడుదల చేశారు. If you can't defeat him, destroy him.. అనే క్యాప్షన్ ఈ ఫస్ట్ లుక్‌పై కనిపించింది. ఓ సీరియస్ లుక్‌లో కనిపించారు సోనియా గాంధీ క్యారెక్టర్ పొషించిన నటి.

జర్మనీకి చెందిన సుజన్నె బెర్నెట్ (Suzanne Bernert) ఈ సినిమాలో సోనియా గాంధీ పాత్రను పోషించారు. గతంలో ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమాలో ఇదే పాత్రలో కనిపించారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ బయోపిక్ అది. ఆమెనే ఇందులో తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+