30 సెకన్లలో రూ.5 లక్షల పర్సనల్ లోన్

ప్రమఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) ఇక నుంచి పర్సనల్ లోన్లు (personal loans) ఇవ్వనుంది. ఇందుకు యాక్సిస్‌ బ్యాంక్‌తో (Axis Bank) కలిసి పనిచేయనుంది. ఈ రెండూ ఇప్పటికే కో బ్రాండెడ్‌ క్రెడిట్‌కార్డును తీసుకొచ్చాయి. తాజాగా పర్సనల్ లోన్స్ విభాగంలోకి అడుగుపెట్టాయి. యాక్సిస్ బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్లు కావాలంటే ఇకనుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా పొందొచ్చు.

మూడు సంవత్సరాల కాల వ్యవధిపై రూ.5 లక్షల వరకు రుణాలను మంజూరు చేయనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. పర్సనల్‌ లోన్స్‌, క్రెడిట్‌ కార్డులు వంటి అన్‌ సెక్యూర్డ్‌ రుణాలపై భారతీయ రిజర్వు బ్యాంక్ ఆందోళన వ్యక్తంచేస్తున్న తరుణంలోనే ఈ రెండు సంస్థల నుంచి ప్రకటన వెలువడటం గమనార్హం.

fiipkart

ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పటికే బై నౌ పే లేటర్‌, ఈఎంఐ (EMI), కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డు సౌకర్యాన్ని కల్పిస్తోంది. వినియోగదారుల కొనుగోలు అవసరాలను సులువుగా తీర్చుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని సంస్థ పేర్కొంది. ఫ్లిప్ కార్ట్ తో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల తమ రుణ వితరణ మరింత విస్తృతం కానుందని యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ సమీర్‌ శెట్టి వ్యాఖ్యానించారు.

ఫ్లిప్‌కార్ట్‌లో పర్సనల్‌ లోన్‌ కేవలం 30 సెకన్లలోనే మంజూరవుతుందని ఇరు సంస్థలు వెల్లడించాయి. వినియోగదారులు తమ పాన్‌కార్డు, పుట్టిన తేదీ, వృత్తి వివరాలు అందివ్వాల్సి ఉంటుంది. అనంతరం ఆ వ్యక్తికి ఎంత రుణం మంజూరవుతుందో యాక్సిస్‌ బ్యాంక్‌ చెబుతుంది. గరిష్ఠ పరిమితికి లోబడి రుణంతోపాటు పిరియడ్ ను ఎంచుకోవచ్చు. 6 నెలల నుంచి 36 నెలల వరకు అందుబాటులో ఉన్నాయి. రుణానికి సంబంధించిన పూర్తి వివరాలు, రీపేమెంట్‌ షెడ్యూల్‌ వంటి వివరాలను ఫ్లిప్‌కార్ట్‌ అందజేస్తుంది. సంస్థకు దేశవ్యాప్తంగా 45 కోట్ల మంది వినియోగదారులున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+