మంత్రి కేటీఆర్‌ను మహిళలు ఒక్కసారికి సీఎం చేశారు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఒక్కరోజుకు ముఖ్యమంత్రి అయ్యారు! బుధవారం ఒక్కరోజు ముఖ్యమంత్రిగా భావించుకోవాలని కోరుతూ ఆయనను ప్రశ్నలు అడిగారు. రాజధానిలోని సమస్యల పైన ఆయనను వారు ప్రశ్నించారు.
బుధవారం ఫిక్కీ లేడీస్ ఆర్గనేజేషన్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఫిక్కీ లేడీస్ పలువురు మాట్లాడుతూ... 'సర్, మీరే ముఖ్యమంత్రి అనుకోండి. మీరు రోడ్డు పైన వెళ్తున్న సమయంలో ఎవరిని కూడా వెళ్లేందుకు అనుమతించరు. కాబట్టి మీకు ట్రాఫిక్ సమస్యలు తెలియక పోవచ్చు' అన్నారు.

దానిపై స్పందించిన కేటీఆర్.. తాను తన కారుకు బ్లూ బల్బ్ లేకుండానే ప్రయాణం చేస్తున్నానని చెప్పారు. దీంతో వారు మాట్లాడుతూ.. సర్.. ఓసారి రాజ్ భవన్ రోడ్డుకు వచ్చి చూడాలని, ట్రాఫిక్ సమస్య ఎంతగా ఉందో అర్థమవుతుందని వారు అన్నారు.












Click it and Unblock the Notifications