మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు... ఆసుపత్రికి తరలింపు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడేల శివప్రసాదరావు శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండేపోటు రావడంతో అప్రమత్తమైన కుటుంభసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్థుతం ఆయన గుంటూరులోని లక్ష్మీ సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాగా కొద్ది రోజులుగా పలు వివాదాలు ఆయన చుట్టు తిరుగుతున్న విషయం తెలిసిందే..తాజాగా అసెంబ్లీ ఫర్నిచర్‌ను తన వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు.మరోవైపు కోడెల కార్యాలయంలో చోరీ జరిగింది. దీంతో పలు కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ సామాగ్రిని దోంగిలించినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించగా, అసెంబ్లీ ఫర్నిచర్ తన వద్ద ఉందని ఆయన అంగీకరించడంతో అసెంబ్లీ సిబ్బంది దాన్ని స్వాధినం చేసుకునేందుకు సిద్దమయ్యారు. కాగా అంతకు ముందు కోడేల కుటుంభసభ్యులపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే..












Click it and Unblock the Notifications