చంద్రబాబు, వైఎస్ జగన్ ఆస్తుల్లో ఎంత తేడా సామి, ఎవరికి ఎక్కువ ఆస్తులు ఉన్నాయంటే !
విజయవాడ/కుప్పం: భారతదేశంలో రాజకీయాల్లో ఉంటున్న వాళ్లు కనీసం కౌన్సిలర్ కావాలంటే కోట్ల రూపాయలు ఖర్చు చెయ్యాల్సి వస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ సిట్టింగ్ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఆస్తుల వివరాలు బయటకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
పంచాయితీల్లో సర్పంచ్ లుగా, జడ్ పీటీసీ మెంబర్ గా, సిటీల్లో కార్పోరేటర్లుగా, నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చెయ్యాలంటే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు అని ప్రజలు ఆలోచిస్తున్నారు. భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి.

భారతదేశంలో అత్యదికంగా ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమక్రెటిక్ రిఫార్స్ పంప్థ వివరాలు వెళ్లడించింది. దేశంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన రాజకీయ నాయకుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమక్రెటిక్ రిఫార్స్ పంప్థ బయటపెట్టింది. భారతదేశంలో అత్యది ఆస్తులు ఉన్న టాప్ టెన్ ఎమ్మెల్యేల వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ భారతదేశంలోనే అత్యదిక ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేగా మొదటి స్థానంలో నిలిచారు. కర్ణాటకకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టాప్ టెన్ లోని నాలుగు స్థానాల్లో నిలిచారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయడు ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి.

అక్రమాస్తుల కేసులో వైఎస్. జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లి తరువాత బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటు తెలుగుదేశం పార్టీకి సినిమా చూపించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీ స్థాపించిన కొద్ది సంవత్సరాల్లోనే వైఎస్. జగన్ ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్- తెలంగాణ విభజన తరువాత మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల వివరాలు బయటకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. భారతదేశంలోని టాప్ టెన్ కోటీశ్వరులైన ఎమ్మెల్యేల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమక్రెటిక్ రిఫార్స్ పంప్థ విడుదల చేసింది.
ఎమ్మెల్యే పేరు - రాష్ట్రం -నియోజక వర్గం- ఆస్తుల - వివరాలు పార్టీ
---------------------------------------------------------------------------------------
1. డీకే శివకుమార్ - కర్ణాటక- కనకపుర -రూ. 1, 413 కోట్లు -కాంగ్రెస్
2. కేహెచ్, పుట్టస్వామి- కర్ణాటక- గౌరిబిదనూరు -రూ. 1, 267 కోట్లు -ఇండిపెండెంట్
3. ప్రియాక్రిష్ణ -కర్ణాటక -గోవిందరాజనగర (బెంగళూరు)- రూ. 1, 156 కోట్లు- కాంగ్రెస్
4. నారా చంద్రబాబు నాయుడు- ఆంధ్రప్రదేశ్ -కుప్పం -రూ. 668 కోట్లు- టీడీపీ
5. జయంతి బాయ్- గుజరాత్ -మానస- రూ. 661 కోట్లు- బీజేపీ
6. బైరతి సురేష్- కర్ణాటక- హెబ్బాళ -రూ. 648 కోట్లు- కాంగ్రెస్
7. వైఎస్. జగన్ మోహన్ రెడ్డి -ఆంధ్రప్రదేశ్ -పులివెందుల- రూ. 510 కోట్లు -వైఎస్ ఆర్ సీపీ
8. పరాగ్ షా- మహారాష్ట్ర -ఘటకేస్కర్ ఈ స్ట్ -రూ. 500 కోట్లు- బీజేపీ
9. టీఎన్. బాబా -చత్తీస్ ఘడ్ -అంబికాపుర -రూ. 500 కోట్లు -ఐఎన్ సీ
10. మంగళ ప్రభాత్ లోథా- మహారాష్ట్ర- మలబార్ హిల్- రూ. 441 కోట్లు- బీజేపీ
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications