మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో అనూహ్య మలుపు- జోగి రమేష్ అరెస్ట్?
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేపిన చిత్తూరు జిల్లా మొలకల చెరువు కల్తీ మద్యం కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ ను ఎదుర్కొంటోన్నారు. కల్తీ మద్యం తయారీలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. ఈ క్రమంలో ఈ తెల్లవారు జామున విజయవాడ ఇబ్రహీంపట్నంలో గల జోగి రమేష్ ఇంటికి పెద్ద సంఖ్యలో ప్రత్యేక దర్యాప్తు టీమ్ అధికారులు, పోలీసులు చేరుకున్నారు. ఆయనను అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది.
జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రాము కూడా అరెస్టును ఎదుర్కొంటోన్నారు. మొలకలచెరువులో భారీగా కల్తీ మద్యం తయారీ గుట్టు కొద్దిరోజుల కిందటే రట్టయిన విషయం తెలిసిందే. నిందితులు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, తంబళ్లపల్లి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జీ జనార్ధన్ ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు. ఇప్పటికే ఆయన అరెస్ట్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొలకలచెరువు కల్తీ మద్యం సరఫరా అయిందంటూ గతంలో వార్తలొచ్చాయి.

కల్తీ మద్యం తయారీ కేసులో జోగి రమేష్ ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణ సందర్భంగా వెల్లడించారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు పెట్టారు. తాజాగా అరెస్ట్ చేయనున్నారు. ఈ తెల్లవారు జామున ఆయన ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. జోగి రమేష్ ను అరెస్ట్ చేస్తోన్నారనే విషయం తెలిసిన వెంటనే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్ద గుమికూడారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
టీడీపీ నాయకుడు జనార్దన్ చేసిన ఆరోపణలను ఇదివరకే తోసిపుచ్చారు జోగి రమేష్. తన ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. అక్రమంగా తనను ఇరికించే ప్రయత్నం చేస్తోన్నారని విమర్శించారు. నకిలీ మద్యం తయారీ, పంపిణీ, అమ్మకాలపై రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే తాను వివరణ ఇచ్చానని, నకిలీ మద్యంతో తనకెలాంటి సంబంధం లేదని, ఏ విచారణకైనా తాను సిద్ధమని స్పష్టం చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రమాణం చేశారు.
ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రానికి వెళ్లి అక్కడి పరిస్థితులను స్వయంగా చూశానని, ఆ దృశ్యాలను ప్రజల ముందుకు తెచ్చానని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో యథేచ్ఛగా నకిలీ మద్యం సరఫరాను నిలదీయడాన్ని ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేక పోతున్నారని, అందుకే తనను కేసులో ఇరికించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించడం కోసం సీబీఐ దర్యాప్తు, లై డిటెక్టర్ టెస్ట్, నార్కో అనాలసిస్ టెస్ట్ వంటి దేనికైనా నేను సిద్ధమని అన్నారు.
-
ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదు - తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు..!! -
మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం రద్దు.. పవన్ సంచలన నిర్ణయం వెనుక! -
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
మీ అవగాహన ఇంతేనా ? చంద్రబాబుకు బుగ్గన ఘాటు కౌంటర్..! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
"ఆ మంత్రికి మహిళలంటే పిచ్చి.. 5 వేల మందితో అఫైర్" -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!!












Click it and Unblock the Notifications