వైసీపీకి రాజీనామా చేసి అల్లు కాంపౌండ్‌లో తేలిన అవంతి

Allu Arjun release: ఐకన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ తెల్లవారు జామున ఆయన భారీ బందోబస్తు మధ్య తొలుత గీతా ఆర్ట్స్ కార్యాలయానికి, ఆ తరువాత ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఇంటికి సినీ ప్రముఖులు పోటెత్తారు. ఆప్యాయంగా పలకరిస్తోన్నారు.

సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయనకు బెయిల్ లభించింది. 50 వేల రూపాయల పూచీకత్తుపై నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు.

Former Ministers Avanthi Srinivas and Ganta Srinivas meets Allu Arjun at his residence

ఇంటికి చేరిన అల్లు అర్జున్‌ను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు పలకరిస్తోన్నారు. మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖ అల్లు అర్జున్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టారు. ఆ సమయంలో సురేఖ సోదరుడు అల్లు అరవింద్ పక్కనే ఉన్నారు. చెల్లెలికి ధైర్యం చెప్పారు.

దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు, సుకుమార్, వంశీ పైడిపల్లి, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, హీరోలు నారాయణ మూర్తి, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, దర్శకుడు హరీష్ శంకర్, అక్కినేని నాగ చైతన్య.. అల్లు అర్జున్‌ను పలకరించిన వారిలో ఉన్నారు.

కాగా ఏపీకి చెందిన మాజీ మంత్రులు అవంతి శ్రీనివాస్, గంటా శ్రీనివాస్ సైతం ఈ ఉదయమే అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. ఆయనను కలిశారు. తొలుత అవంతి శ్రీనివాస్ అక్కడికి చేరుకోగా.. ఆ కొద్దిసేపటికే గంటా శ్రీనివాస్ అల్లు ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్, ఆయన తండ్రి అల్లు అరవింద్‌ను పలకరించారు. ఆప్యాయంగా మాట్లాడారు. అక్కడికి వచ్చిన సినీ పెద్దలను పలకరిస్తూ సందడిగా కనిపించారు.

రెండు రోజుల కిందటే అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, దీనివల్ల భీమిలి నియోజకవర్గం ఇన్‌ఛార్జి బాధ్యతలు, వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తోన్నానంటూ జగన్‌కు లేఖ రాశారు. దీన్ని ఆమోదించాల్సిందిగా కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+