60 ఎకరాల్లో "భారత్ సింధూర్" MSME పార్కు శంకుస్థాపన... ఎక్కడంటే ?
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు రూరల్ నియోజకవర్గం అమంచర్లలో.. "భారత్ సింధూర్" ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటుకు టీడీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. 60 ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేయనుండగా.. సీఎం చంద్రబాబు సూచన మేరకే ఈ పేరు పెట్టినట్టు ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత మహిళల సిందూరాన్ని చేరిపేయడానికి ప్రయత్నించిన పాకిస్తాన్‌కు ఆపరేషన్ సిందూర్‌తో భారత్ బుద్ది చెప్పిందన్నారు.
అలానే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ..
పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడులకు భారత్‌లో భయపడేవాళ్లు ఎవరూ లేరని.. పాక్ దాడులను భారత్ సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. ఈ పార్క్ ఏర్పాటు వలన వందలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ముఖ్యమంత్రి సూచనలతో భారత సైన్యం పరాక్రమానికి చిహ్నంగా ఈ పార్కు 'భారత్ సింధూర్' అనే గౌరవనామం పెట్టడం జరిగిందని పేర్కొన్నారు. తమకు తాము ఎదగటం చేతకాని పాకిస్థాన్ ఉన్మాదులు.. భారత్ దేశంలో అస్థిరత కల్పించాలనే దురుద్దేశంతో ఉగ్రవాదులను ప్రేరేపిస్తూ అమాయకులపై మారణకాండలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఉన్మాదులు కాల్పుల ద్వారా భారతీయుల రక్తాన్ని పారించి భయపెట్టాలన్న ప్రయత్నాలు అత్యంత దుర్మార్గమైనవని చెప్పారు.

ఎరుపు అంటే ఎవరికి భయం? ఎరుపు అంటే మన మాతృభూమి భరతమాత నుదుట సింధూరం అని తెలిపారు. భారతదేశంలోని కోట్లాది మహిళల నుదుట సింధూరమే ఎరుపు అని.. అమాయకులను చంపి మహిళల నుదుట సింధూరాన్ని చెరిపేయాలనుకుంటే ప్రభుత్వం సహించదని చెప్పారు. చరిత్రలో ఎన్నో యుద్ధాల్లో ఓడిపోయి తలదించుకున్న మీరు ఇంకా గుణపాఠం నేర్చుకోలేదా?" అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మారండని హితవు పలికారు. పాకిస్తాన్ ఉన్మాదులు పద్దతులు మార్చుకోకుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ కనుమరుగు అవ్వడం ఖాయమని చేప్పారు.
భారత్-పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను యావత్ ప్రపంచం నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు. ధర్మ పోరాటం చేస్తున్న భారత సైన్యానికి మోరల్ సపోర్ట్ కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో 60 ఎకరాల్లో ఈ MSME పార్కు పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications