మహిళతో అసభ్యంగా చాటింగ్: టీడీపీని ఇబ్బందుల్లోకి నెట్టిన వైనం
TDP: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కొత్త చిక్కులొచ్చిపడ్డాయి. మహిళలను ఆ పార్టీ నేతలు చులకనగా చూస్తారనే విషయం మరోసారి బయటపడింది. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అలాంటి పరిస్థితులు మళ్లీ టీడీపీలో తలెత్తినట్టే కనిపిస్తోంది.
తమకు కనీస గౌరవం దక్కట్లేదనే కారణంతో ఇదివరకు సినీ నటులు కవిత, దివ్యవాణి, వాణివిశ్వనాథ్, యామిని శర్మ, పాలేటి కృష్ణవేణి టీడీపీకి గుడ్‌బై చెప్పిన వారే. పార్టీలో నెలకొన్న వాతావరణం.. మహిళలకు అక్కడివాళ్లు ఇచ్చే విలువ, గౌరవం అన్నీ గమనించి పార్టీని వీడి వెళ్లి పోయారు.

ఇప్పుడు తాజాగా ఓ మాజీ ఎమ్మెల్యే తన వద్దకు సాయం కోసం వచ్చిన మహిళలను ఏ విధంగా లోబరుచుకుని లైంగికంగా ఇబ్బంది పెట్టింది బయటకు వచ్చింది. ఇది టీడీపీకి కొత్త ఇబ్బందులను తీసుకొచ్చింది. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఆ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంపై భగ్గుమంటోన్నారు.
రాయలసీమకు చెందిన ఆ మాజీ ఎమ్మెల్యే ఓ మహిళతో అసభ్యంగా చాటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. గతంలో ఎమ్మెల్యేగా ఉండగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. పంచాయితీకి వచ్చిన మహిళలకు లోబరుచుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యే అంటూ విమర్శలు గుప్పిస్తోంది వైసీపీ.

ఇప్పుడు బయటపడింది ఒక్క ఫోన్ చాటింగ్ మాత్రమేనని.. ఇలాంటివి బయటకు రాని రాసలీలలు ఆయనలో అనేకం ఉన్నాయని, అప్పట్లో కుటుంబ తగాదాలతో పంచాయితీ కి వచ్చిన వాళ్లకు డబ్బు ఆశ చూపి లోబరుచుకోవడం ఆ మాజీ ఎమ్మెల్యే టాలెంట్ అంటూ మండిపడుతోంది.
పార్టీకి అధికారం లేకపోయినా, ఆయన వైఖరి మాత్రం మారట్లేదు. తన దగ్గరకు సాయం కోసం వచ్చిన మహిళలను అవసరానికి వాడుకోవడంలో ఈయన సిద్ధహస్తుడనేది మరోసారి రుజువైంది. ఆయన రాసలీలల వ్యవహారం మూడు మెసేజిలు.. ఆరు వీడియో కాల్స్ అన్నట్లుగా సాగుతోందంటూ ధ్వజమెత్తుతున్నారు.












Click it and Unblock the Notifications