బాబు, ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికరం: కోడళ్ళను అత్తలు లెక్క చేయడం లేదు, అలా తిరిగినా...

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి:ఇంటింటికి టిడిపి కార్యక్రమంపై సమీక్ష సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో చంద్రబాబునాయుడు ఉల్లాసంగా మాట్లాడారు. పార్టీ నేతలపై జోకులు వేస్తూ నవ్వించారు. రోజూ గంటల తరబడి తిరుగుతున్నా తనకు మంచి గ్రేడ్ ఎందుకు రావడం లేదని ఓ ఎమ్మెల్యే చంద్రబాబునాయుడును ప్రశ్నించారు.

వైసీపీ ఎమ్మెల్యేలకు కోడెల ఫోన్: కోర్టు తీర్పు తర్వాతే నిర్ణయం

ఇంటింటికి టిడిపి కార్యక్రమంపై టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంపై చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.

బాబును అంతం చేసే కుట్ర, నాపై జగన్‌తో సహ ఎవరైనా పోటీ చేయండి: ఆది సంచలనం

ఇంటింటికి టిడిపి కార్యక్రమంపై పార్టీ నేతల పనితీరు ఆధారంగా చంద్రబాబునాయుడు వారికి గ్రేడ్‌లు ఇస్తున్నారు. ఈ గ్రేడ్‌ల్లో వెనుకబడిన నేతలకు బాబు క్లాస్ తీసుకొంటున్నారు. ఇంటింటికి టిడిపి కార్యక్రమంపై పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్పరెన్స్‌లో పార్టీ నేతలపై బాబు జోకులు వేశారు.

 ఆలపాటి రాజ గురించి వాకబు చేసిన బాబు

ఆలపాటి రాజ గురించి వాకబు చేసిన బాబు

ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంపై చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ర్టంలోని మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఇన్‌ఛార్జ్‌లతో ముచ్చటించారు. సమావేశానికి హాజరుకాని ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ వంటి సీనియర్‌ ఎమ్మెల్యేలను తాను అడిగానని చెప్పమని చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యాఖ్యానించారు.

ఆయా జిల్లాల ఎమ్మెల్యేల గ్రేడులు ముఖ్యమంత్రి చదివి వినిపించిన సమయంలో ఎమ్మెల్యేలు కొంతమంది తాము బాగానే తిరుగుతున్నా గ్రేడ్‌లు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.

 మోదుగులకు గ్రేడింగ్‌పై ఆరా తీసిన బాబు

మోదుగులకు గ్రేడింగ్‌పై ఆరా తీసిన బాబు

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే వేణుగోపాల్‌రెడ్డికి మంచి గ్రేడ్‌ రాకపోవడంపై ముఖ్యమంత్రి స్పందించారు. లావు పెరగడం వల్ల తిరగలేకపోతున్నావా వేణు అంటూ నవ్వుతూ ప్రశ్నించారు. దీనికి వేణు దగ్గర్నుంచి మంచి జవాబే వచ్చింది.. తానేమీ ఇంటిదగ్గర కూర్చుని ట్యాబ్‌లో సమాచారం పంపడం లేదని.. ఇంటింటికి వెళుతున్నానని చెప్పారు. ఇది వరకు కోడళ్లు ఏం చెబితే అది అత్తలు చేసేవారని, మీరు ఇచ్చే పెన్షన్ల వల్ల ఇప్పుడు కోడళ్లను అత్తలు లెక్కచేయడం లేదని మోదుగుల వేణుగోపాల్ ‌రెడ్డి వీడియో కాన్పరెన్స్‌లో చెప్పడంతో చంద్రబాబుతో పాటు అందరు నవ్వారు.

 ఎంత తిరిగినా గ్రేడింగ్ రావడం లేదు

ఎంత తిరిగినా గ్రేడింగ్ రావడం లేదు

నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తనకు తక్కువ గ్రేడ్‌ రావడంపై వీడియో కాన్ఫరెన్స్‌లోనే చంద్రబాబునాయుడును ప్రశ్నించారు.ఇదే సమయంలో మంత్రి పత్తిపాటి పుల్లారావు మార్కుల విషయమై చంద్రబాబుకు విన్నపాలు చేసుకున్నారు.. తాను ఇన్‌ఛార్జ్‌గా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు రోజులు తిరిగానని.. అందుకు మీరు మంచి మార్కులు వేయాలని సీఎంను కోరారు.. ఇక పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ మాత్రం డిసెంబర్ వరకు ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని పొడిగించాలని చంద్రబాబును కోరారు.

వల్లభనేని వంశీపై జోక్

వల్లభనేని వంశీపై జోక్

ఈ కార్యక్రమంలో భాగంగానే పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో తమ సమస్యలను చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్ళారు.వారి సమస్యలను చంద్రబాబునాయుడు సావధానంగా విన్నారు. ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్‌.. వల్లభనేని వంశీ ప్రత్యేక టెక్నాలజీ పెట్టుకున్నట్టుగా ఉన్నారంటూ జోక్‌ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Funny conversation between AP chief minister Chandrababunaidu and TDP MLAs on Wednesday. Chandrahabunaidu conducted video conference with Tdp leaders,mlas on wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి