హోదా వద్దని వైవీరెడ్డితో జగనే నివేదిక ఇప్పించారు: గాలి, మోడీ ట్విట్టర్‌లోనైనా..
తిరుపతి/ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డితో నివేదిక ఇప్పించారని తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు.
అన్యాయం జరిగిందని ఇప్పుడు ఆందోళన చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, సిపిఐ కలిసి వేధిస్తున్నాయని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జదగన్మోహన్ రెడ్డిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఇచ్చే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ కనీసం ట్విట్టర్‌లోనైనా స్పందించడం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడూ కూడా నోరు మెదపడం లేదని ఆయన ఆక్షేపణ తెలిపారు.

ఇదిలావుంటే, పార్టీ ఉనికి కోసమే ఢిల్లీలో వైఎస్ జగన్ దీక్ష చేశారని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. ఏపీకి అన్యాయం జరిగినప్పుడు జగన్ ఎప్పుడూ మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు జగన్‌కు లేదని పల్లె అన్నారు.
మునికోటి ఆత్మహత్య బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా రాష్ట్రానికి వచ్చి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారని మంత్రి పల్లె తెలిపారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications