ఆ హీరో కెరీర్ లోనే అతి గొప్ప సంచలనం
వరుణ్ తేజ్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన గాండీవధారి అర్జున చిత్రం తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద అత్యంత ఘోరంగా విఫలమైంది. ఈ సినిమా చూసినవారంతా అసలు దీన్ని ఎలా ఒప్పుకున్నాడురా దేవుడా అంటూ చర్చించుకుంటున్నారు. ఇటీవలి కాలంలో తెలుగులో ఎన్నో డిజాస్టర్లు వచ్చాయి కానీ, వాటికి ఓ మోస్తరు కలెక్షన్లైనా వచ్చాయి. దీనికి అదికూడా లేదు.
వరుణ్ తేజ్ కెరీర్‌లోనే వరస్ట్ ఓపెనింగ్ 'గాండీవధారి అర్జున' సినిమాకి వచ్చినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటి రెండురోజుల్లో నైజాంలో రూ.80 లక్షలు, సీడెడ్ లో రూ.22 లక్షలు, ఆంధ్రాలో రూ.83 లక్షలు మాత్రమే రాబట్టింది. మిగతా ప్రాంతాల్లో రూ.65 లక్షలు వచ్చాయి. మొత్తంమీద రెండురోజుకు రూ.2.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

విడుదలైన అన్నిచోట్ల అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేనంత రీతిలో, చెప్పడానికి కూడా బాగోని రీతిలో షేర్ వచ్చింది. ఈ సినిమా క్లోజింగ్ షేర్ కనీసం రూ.4 కోట్లు కూడా దాటే అవకాశం లేదంటున్నారు. వరుణ్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నమోదైంది. వాస్తవానికి ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది. కానీ విడుదలైన తర్వాత తేలిపోయింది. ట్రైలర్ మీద వచ్చిన హైప్ కు అనుగుణంగా ఈ సినిమాకు ప్రచారం లోపించింది.
వరుణ్ తేజ్ టైర్-2 హీరో. విభిన్నమైన సినిమా చేసేటప్పుడు అందుకు తగ్గట్లుగానే ప్రి రిలీజ్ ఈవెంట్ ఉండాలని, ప్రమోషన్లు అదిరిపోవాలని, అలా చేయకుండా విడుదల చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఎఫెక్ట్ సినిమా ఓపెనింగ్స్ మీద పడింది. కమర్షియల్ సినిమాలు చేస్తూ హీరోగా నిలదొక్కుకోవాలంటే ప్రయోగాత్మక సినిమాలు చేయడం మాత్రమే సరిపోదని, కథ, కథనం విషయంలో ఎంతో దృష్టి పెట్టాలని అభిమానులు సూచిస్తున్నారు. మరి వరుణ్ తేజ్ ఇప్పటికైనా తన తప్పులు సరిదిద్దుకొని సినిమాలు చేస్తారా? లేదా? అనేది తర్వాత విడుదలయ్యే సినిమాను బట్టి అర్థమైపోతుంది.
,












Click it and Unblock the Notifications