Gannavaram Assembly Election 2024 Results LIVE: గన్నవరంలో టీడీపీకి నిరాశ..వల్లభనేని వంశీ గెలుపు పక్కా..?

ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గం ఒకటి.గన్నవరం ఫలితం కోసం రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన వల్లభనేని వంశీ ఈసారి వైసీపీ నుంచి పోటీ చేయగా.. వైసీపీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ నుంచి బరిలోకి దిగారు.దీంతో ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారు అనేది దానిపై భారీగానే బెట్టింగులు జరుగుతున్నాయి.

వంశీ ఓడిపోతారని చెప్పి టీడీపీ శ్రేణులు భారీగా పందెలు కాస్తున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కూతురు , మాజీ సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరిపై వంశీ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆయన గెలుపుకు ప్రతిబంధకంగా మారాయి. ఇక్కడ ఎలాగైనా వంశీని ఓడించాలనే కసితో ఈ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు పని చేశాయి. చంద్రబాబు సామాజికవర్గం అంతా కూడా ఒకటై వంశీని ఓడించాలని ప్రయత్నించాయి. అయితే వాస్తవ పరిస్థితి దానికి విరుద్దంగా ఉంది. గన్నవరంలో టీడీపీ ఇమేజ్ కన్నా వంశీ వ్యక్తిగత ఇమేజ్‌ను ఎక్కువగా సంపాదించుకున్నారనే విషయాన్ని ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు.

AP assembly election results gannavaram Assembly Election 2024 Results voting counting live updates news in telugu

కష్టం అంటూ ఎవరైన వచ్చి తలుపు తట్టితే..వారికి ఆర్థిక సాయం చేస్తారని..వారంతా కూడా కచ్చింతంగా వంశీ వెంటే ఉంటారని ఆయన అనుచరులు అభిప్రాయపడుతున్నారు. వల్లభనేని వంశీకి నియోజకవర్గంపై మంచి పట్టుంది.పైగా పోలింగ్ మేనేజ్మెంట్‌లో వల్లభనేని వంశీ సిద్దహస్తుడు. దీనికి తోడు రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడం కూడా ఆయనకు కలిసి వస్తుందని వంశీ అనుచరులు చెబుతున్నారు. వంశీ బలానికి జగన్ సంక్షేమ ఫలాల మద్దతు తోడయితే ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అని రాజకీయ పరిశీలకులు సైతం భావిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ సైతం వంశీ గెలుస్తారని ప్రకటించాయి.దీంతో వంశీ మరోసారి గెలిచి గన్నవరంలో హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+