గత నెల ఆ ట్వీట్.. ఈనెల ఈ ట్వీట్?
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి పొందిన గంటా శ్రీనివాసరావు వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా సైలెంటయ్యారంటూ విమర్శలు వచ్చాయి
తెలుగుదేశం పార్టీలో ఉన్నారో? లేదో స్పష్టత లేని గంటా శ్రీనివాసరావు చాలారోజుల తర్వాత పార్టీ అధినేత చంద్రబాబుకు మద్దతు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. అనపర్తిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైందికాదని విమర్శించారు. ప్రతిపక్ష నేత పర్యటనను అడ్డుకునే స్థాయికి దిగజరాడం అంటే నైతికంగా దిగజారడమేనని, ప్రజాస్వామ్యానికి నియంతృత్వం మంచిదికాదని ప్రతిసారీ రుజువైందన్నారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో దివంగత వైఎస్ పాదయాత్రనుకానీ, జగన్ పాదయాత్రను కానీ పోలీసులు ఎక్కడా అడ్డుకోలేదని, లైట్లు ఆపేయడం, మైకు లాక్కొని ఇబ్బందికి గురిచేయండలాంటివేమీ చేయలేదు. ఇది ఏ మాత్రం సహించరానిదని, ఉద్యమానికి దారితీసేలా వ్యవహరించవద్దని ప్రభుత్వ పెద్దలకు తాను సూచిస్తున్నాని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి పొందిన గంటా శ్రీనివాసరావు వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా సైలెంటయ్యారంటూ విమర్శలు వచ్చాయి. ఇటీవలే గంటా ప్రత్యర్థి అయ్యన్న పాత్రుడు ఈ గంటా ఎవడండీ.. ప్రతిసారి పార్టీ, సీట్లు మార్చుకునే వ్యక్తి మనకు వద్దంటూ బహిరంగంగా విమర్శించారు. దీనిపై గంటా బదులివ్వలేదు. నెలరోజుల క్రితమే నారా లోకేష్ ను కలిసి గంటా తాను టీడీపీలోనే కొనసాగుతానని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. యువగళం పాదయాత్ర విజయవంతమవుతుందంటూ ట్వీట్ చేశారు.
మళ్లీ ఇన్ని రోజులకు చంద్రబాబుకు సంఘీభావం తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ట్వీట్ చేయడానికి కూడా ఇన్నిరోజుల సమయం తీసుకునేవారు పార్టీకి అవసరమా? కాదా? అంటే దానికి సమాధానం కూడా అయ్యన్నపాత్రుడి దగ్గరే ఉంటుంది. విశాఖ నార్త్ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన గంటా ఒక్కరోజు కూడా నియోజకవర్గంలో పర్యటించలేదు. శాసనసభ సమావేశాలకు హాజరు కాలేదు.












Click it and Unblock the Notifications