విశాఖలో పేలిన గ్యాస్ సిలిండర్లు (ఫొటోలు)
విశాఖపట్నం: విశాఖపట్నంలో శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లు పేలాయి. అయితే, ఆ ఘటనల్లో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు, ప్రాణ నష్టం సంభవించలేదు. వెంకోజీ పాలెం దరి పెట్రోల్ బంక్‌కు సమీపంలో టీ దుకాణం యజమాని రాజు శుక్రవారం తెల్లవారు జామున గ్యాస్ స్టవ్ వెలిగించేందుకు ప్రయత్నించగా, అప్పటికే లీకవుతున్న గ్యాస్ సిలిండర్‌కు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. దీంతో సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి.

ఆ పేలు శబ్దానికి రహదారి అవతలి వైపు ఉన్న అపార్టుమెంట్ కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఈ సమయంలో రహదారిపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి వెంటనే మంటలను అదుపు చేశారు. అప్పటికే దుకాణం పూర్తిగా దగ్ధమైంది.

మరో ఘటన జివిఎంసి 66వ వార్డు కొత్తపాలెంలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న సారిపల్లి పార్వతి గత కొంత కాలంగా గ్యాస్ సిలిండర్‌ను ఉపయోగించకుండా కట్టెల పొయ్యిపైనే వంట చేస్తోంది. అయితే, శుక్రవారం ఉదయం పొయ్యి వెలిగించగానే అప్పటికే గ్యాస్ లీకవుతున్న సిలిండర్‌కు నిప్పంటుకుంది.

గ్యాస్ సిలిండర్‌కు నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయి. దీంతో ఆమె ధైర్యం చేసి ఆ సిలెండర్‌ను బయటకు విసిరేసి, ఇసుక పోసి మంటలను అదుపు చేసింది.












Click it and Unblock the Notifications