కారులో వచ్చి తల్లిని నెట్టేసి యువతి అపహరణ

త్రిపురాంతకం మండల కేంద్రానికి చెందిన వైద్య విద్యార్థిని షారోన్ బుధవారం మధ్యాహ్నం తన తల్లితో కలిసి ఆస్పత్రికి వచ్చిన సమయంలో నలుగురు వ్యక్తులు కారులో వచ్చి తల్లిని పక్కకు నెట్టి షారోన్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకుని పరారైనట్లు తెలుస్తోంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు.
శ్రావణి వైద్యశాల సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. త్రిపురాంతకం మండల కేంద్రానికి చెందిన జ్ఝానమ్మ తన కూతురు షారోన్ దినకర్‌కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బుధవారం ఆస్పత్రిలో చూపించడానికి మార్కాపురం వచ్చింది.
బస్సు దిగి వైద్యశాలకు వెళ్తున్న సమయంలో ఇండికా కారులో నుంచి దిగిన నలుగురు యువకులు జ్ఞానమ్మను పక్కకు నెట్టేసి 24 ఏళ్ల షారోన్‌ను ఎత్తుకుపోయారు.












Click it and Unblock the Notifications