మెడికల్ కాలేజీల రగడ వేళ.. ఇంకో జగన్ స్కీమ్‌ రద్దు

Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. గత ప్రభుత్వం అమలు చేసిన మరో ఓ వ్యవస్థను రద్దు చేసి పడేసింది.

గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అమలు చేసిన సంక్షేమ పథకాల పేర్లను అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే మార్చివేసింది చంద్రబాబు- పవన్ సర్కార్. అమ్మ ఒడికి తల్లికి వందనం, జగనన్న విద్యా కానుకకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, జగనన్న గోరుముద్దకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, నాడు-నేడుకు మన బడి- మన భవిష్యత్‌గా మార్చింది.

GoAP cancelled reverse tendering system in Water Resources Department

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సామాజిక భద్రత పింఛన్లకు ఎన్టీఆర్ పేరు పెట్టింది. ఈ జాబితాలో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యాదీవెన, వైఎస్సార్ విద్యోన్నతి, వైఎస్సార్ కళ్యాణమస్తు, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథక వంటివి కూడా ఉన్నాయి. వాటిల్లో పింఛన్లు మినహా ఏ ఒక్కటి కూడా అమలు కావట్లేదనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయమే.

జగన్ ప్రభుత్వం అమలు చేసిన మరో విధానాన్ని రద్దు చేసింది చంద్రబాబు- పవన్ కూటమి సర్కార్. అదే- రివర్స్ టెండరింగ్. వేల కోట్ల రూపాయలతో కార్యకలాపాలను నిర్వహించే జల వనరుల మంత్రిత్వ శాఖలో దుబారాను అరికట్టడానికి, ఆర్థిక నియంత్రణ కోసం జగన్ ప్రభుత్వం అమలు చేసిన విధానం ఇది.

ఈ విధానాన్ని చంద్రబాబు- పవన్ ప్రభుత్వం రద్దు చేసింది. రివర్స్ టెండరింగ్‌ను అమలు చేస్తూ 2019 ఆగస్టు 16వ తేదీన జారీ అయిన జీవో నంబర్ 67ను రద్దు చేసింది. దాని స్థానంలో పాత విధానం అంటే ఆన్‌లైన్ ఇ-ప్రొక్యూర్‌మెంట్ వ్యవస్థను అనుసరిస్తామని తెలిపింది. రివర్స్ టెండరింగ్ వ్యవస్థకు సరితూగేలా ఇ- ప్రొక్యూర్‌మెంట్‌ను అమలు చేస్తామని వివరించింది.

ఈ మేరకు జీవో నంబర్ 40ను జల వనరులు (సంస్కరణలు) మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీ సాయిప్రసాద్ విడుదల చేశారు. రివర్స్ టెండరింగ్ విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయంటూ బోర్డ్ ఆఫ్ ఇంజినీర్స్ గతంలో సిఫారసు చేసిందని, దీనికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+