కనకదుర్గమ్మ దర్శనం కోసం పోటెత్తిన భక్తులు - కీలక సూచనలు..!!

ఇంద్రకీలాద్రి పై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు కనకదుర్గగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. జై దుర్గా జై జై దుర్గ అన్న నామస్మరంతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. కాగా దుర్గమును దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భవానీలు వచ్చారు. మూలా నక్షత్రం వేళ భక్తులు అంచనాలకు మించి రావటంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. సామాన్య భక్తులతోపాటు, వీఐపీల తాకిడి ఎక్కువవ్వడంతో కొండ కిటకిటలాడింది.

అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారు బుధవారం సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి ఆలయం మూసివేసే సమయానికి సుమారు 1.50 లక్షల నుంచి 2 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారని అధికారుల అంచనా. సీఎం చంద్రబాబు దంపతులు, మంత్రి లోకేశ్‌ దంపతులు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. శరన్నవరాత్రి మహోత్సవాలలో అత్యంత కీలకమైన మూలా నక్షత్రం నాడు ఎలాంటి వివాదాలు, ఆటంకాలు లేకుండా భక్తులు దుర్గమ్మను సరస్వతీ అలంకారంలో దర్శించుకున్నారు.

Goddess adorned with Durga Devi alankaram at Indrakeeladri

భక్తుల రద్దీతో
అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అర్ధరాత్రి నుంచే భారీగా తరలివచ్చారు. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు అసాధారణంగా దర్శనాలు జరిగాయి. భక్తుల రద్దీ దృష్ట్యా వ్యవస్థలన్నీ ఏమాత్రం ఏమరపాటుగా లేకుండా వ్యవహరించడంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదు. కార్పొరేషన్‌ దగ్గర నుంచి కంటెయినింగ్‌ జోన్లను ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో భక్తులను ఈ ప్రాంతంలో హోల్డింగ్‌ చేశారు. ఆ తర్వాత క్యూలైన్లలోకి పంపారు. క్యూలలో తొక్కిసలాటను నివారించటానికి వీలుగా రోపులతో నిర్ణీత దూరం వరకు భక్తులను హోల్డ్‌ చేశారు. ఇలా రోజంతా హోల్డ్‌ చేయటం వల్ల ఎక్కడా తొక్కిసలాటకు అవకాశం ఇవ్వలేదు.

దేవాలయ ఏర్పాట్లు
మూలా నక్షత్రం రోజున గతంలో అమ్మవారి దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టేది. ఈ ఏడాది అనధికార దర్శనాలను పూర్తిగా నియంత్రించటంవల్ల కేవలం గంటన్నర వ్యవధిలోనే భక్తులు అమ్మ దర్శనం చేసుకున్నారు. భక్తుల డిమాండ్‌కు అనుగుణంగా మంచినీళ్ల ప్యాకెట్లను సిద్ధం చేశారు. లడ్డూ ప్రసాదాలను ముందస్తుగా సిద్ధం చేసి పెట్టుకోవటం వల్ల ఎలాంటి కొరతా ఏర్పడలేదు. ఈసారి రూ. 100కి ఆరు లడ్డూల ప్యాకెట్లను అందుబాటులోకి తీసుకురావటంతో వీటిని పెద్ద సంఖ్యలో కొనుగోలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+