మహిళలకు దసరాకు బ్రహ్మాండమైన కానుక.. మిస్ చేసుకోకండి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ అన్ని వర్గాల వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడానికి పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం మహిళలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుంది.
మహిళలకు సీఎం చంద్రబాబు శుభవార్త
ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోను ఒక మహిళ పారిశ్రామికవేత్త కావాలని సంకల్పించి ఆ దిశగా మహిళలకు ఆర్థిక భరోసా అందిస్తూ చిన్న తరహా పరిశ్రమలు పెట్టడానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు అందించి వారిద్వారా నిర్వహించడానికి సహాయం చేస్తున్నారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి చంద్రబాబు శుభవార్త చెబుతున్నారు.

వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి రుణాలు
కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేవారు వారికి , వారి యూనిట్ల ఏర్పాటుకు, విస్తరణకు పదివేల రూపాయల నుండి రెండు లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేయనున్నారు. స్త్రీనిధి పథకం కింద పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు సహాయం అందించనున్నారు. ఇక ఎస్సీ ఎస్టీలకు ఉన్నతి పథకం కింద 50 వేల నుంచి రెండు లక్షల వరకు, అవసరమైతే పదిలక్షల వరకు కూడా సహాయం అందిస్తారు.
ఈ యూనిట్ లకు ప్రోత్సాహం అందించనున్న ఏపీ ప్రభుత్వం
ఈ డబ్బులతో ప్రభుత్వం ఆహార శుద్ధి యూనిట్లు, డైరీ యూనిట్లు, కలంకారి వస్త్రాలు, పచ్చళ్ళు, పేపర్ ప్లేట్లు, దినుసుల పొడులు , టీ షర్ట్స్ తయారీ, ఫ్యాన్సీ షాపులు, హోటళ్ళు వంటివి చిన్న పరిశ్రమలను ప్రోత్సహించనుంది. ఈ యూనిట్లు ఏర్పాటు చేసిన మహిళలు కనీసం ఇంకొక మహిళ కైనా ఉద్యోగం కల్పించాలని నిబంధన పెట్టింది. డిఆర్డిఏ అధికారులు సర్వే ద్వారా వీరిని గుర్తించి సహాయం చేస్తారు.
విజయదశమి మంచిరోజు మొదలెట్టేయండి
ఈ యూనిట్లను జీవనోపాధి యూనిట్లు, ఎంటర్ప్రెన్యూర్ యూనిట్లు, ఎంటర్ప్రైజెస్ యూనిట్లుగా వర్గీకరిస్తారు. యూనిట్ లను ఏర్పాటు చేసిన తర్వాత మహిళలకు మార్కెటింగ్ లోను, వ్యాపార విస్తరణ లోను సహాయాన్ని అందిస్తారు. ఇక యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న మహిళలు విజయదశమి పండుగ రోజు ముహూర్తం పెట్టుకోండి. దీనికోసం డి ఆర్ డి ఏ అధికారులను సంప్రదించి మరిన్ని వివరాలను తెలుసుకుని రుణాలు పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంతో చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్న మహిళలకు ఆర్థిక భరోసా లభిస్తుంది.












Click it and Unblock the Notifications