CM Jagan Biopic: రియల్ స్టోరీ వచ్చేస్తోంది : హీరో - మూవీ పేరు ఖరారు..!!
వెండితెర పైకి సీఎం జగన్ పొలిటికల్ లైప్. హీరో - పేరు సిద్దమైంది. ఏపీలో మరో ఏడాదిన్నార కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు సీఎం జగన్ - టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటుగా జనసేనానికి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఇందు కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఇదే సమయంలో నందమూరి కుటుంబం - సినీ ఇండస్ట్రీకి ఉన్న అనుబంధాన్ని ఇప్పుడు టీడీపీ సద్వినియోగం చేసుకుంటోంది. తాజాగా ఓటీటీ ద్వారా చంద్రబాబు - బాలయ్య 1995 నాటి పరిణామాలతో పాటుగా అభిమానులను ఆకట్టుకొనే విధంగా రూపొందించిన టాక్ షో ఇప్పుడు రాజకీయంగానూ హాట్ టాపిక్ గా మారింది.

జగన్ రాజకీయ యాత్ర ఆధారంగా
ఇదే సమయంలో మరో కీలక అంశం బయటకు వచ్చింది. 2019 ఎన్నికల ముందు వైఎస్సార్ రాజకీయ యాత్ర ఆధారంగా యాత్ర సినిమా విడుదలైంది. వైఎస్సార్ అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు 2024 ఎన్నికల ముందు వైఎస్ బయోపిక్ సిద్దం అవుతోంది. యాత్ర సినిమా తీసిన మహి రాఘవపూడి ఇప్పుడు సీఎం జగన్ బయోపిక్ కు కధతో సిద్దమయ్యారు. ఇందు కోసం హీరోగా ప్రముఖ నటుడు విశాల్ ను ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. 2009 లో కడప ఎంపీగా రాజకీయ జీవితం ప్రారంభించిన సీఎం జగన్.. తన తండ్రి మరణం తరువాత ఎదుర్కొన్న పరిస్థితులను ఈ బయోపిక్ లో చిత్రీకరణకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఓదార్పు యాత్ర - కాంగ్రెస్ నుంచి బయటకు రావటం.. అక్రమ కేసులను కూడా ఉన్నది ఉన్నట్లుగా చిత్రీకరించాలని నిర్ణయించారు.

పాదయాత్ర - సీఎంగా ప్రమాణం
ఇక, 2014 ఎన్నికల నుంచి జగన్ రాజకీయ పోరాటం కొత్త టర్న్ తీసుకుంది. నాడు విపక్ష నేతగా అసెంబ్లీలో వ్యవహరించిన తీరు..ఏపీ ప్రయోజనాల కోసం చేసిన దీక్షలను ఇందులో హైలైట్ చేయనున్నారు. ఇక, అసెంబ్లీ కాదు..నేరుగా ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలనే నిర్ణయంతో ప్రారంభమైన పాదయాత్ర ఈ బయోపిక్ లో ప్రధాన అంశంగా మారబోతోంది. రికార్డు స్థాయిలో 3648 కిలో మీటర్ల పాదయాత్ర చేసి..నవరత్నాలను ప్రకటించి రాష్ట్ర చరిత్రలోనే తొలి సారిగా 151 సీట్లతో అధికారం దక్కించుకొని.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వరకూ మొత్తం వెండి తెరపైకి ఎక్కించేందుకు ప్రణాళికలు సిద్దమయ్యాయి. కొంత మంది హీరోలు సీఎం జగన్ పైన చేస్తున్న విమర్శలకు కౌంటర్ గా జగన్ రీల్ హీరో కాదు - రియల్ హీరో అనే క్యాప్షన్ కూడా సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది.

హీరో - పేర్లు సిద్దం
సినిమా కోసం రెండు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అందులో ఒకటి "రియల్ హీరో" కాగా, "జగన్..అనే నేను" అనేది రెండో పేరుగా పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం సినిమా ప్రాజెక్టు గురించి సీఎం జగన్ కు వివరించి..ఆయన ఆమోదం పొందాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేసారు. మరి..సీఎం జగన్ దీనికి అంగీకరిస్తారా లేక నిరాకరిస్తారా అనే నిర్ణయానికి అనుగుణంగా ఈ సినిమా వెండితెర పైకి వచ్చే అంశం ఆధారపడి ఉంది.












Click it and Unblock the Notifications