సొంత జిల్లాలో షాక్ ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, ఢమాల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సొంత జిల్లా చిత్తూరులో ఊహించని షాక్ ఇచ్చారు. జన వనరుల శాఖలో జరుగుతున్న ఆ పనులన్నీ వెంటనే నిలివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వందల కోట్ల రూపాయల విలువైన పనుల ఆగిపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్లు హడలిపోయారని తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వైసీపీ అస్మదీయులకు ఈ పనులు కట్టబెట్టారని ఆరోపణలు ఉన్నాయి..

వచ్చే ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉంటుందనుకున్న కాంట్రాక్టర్లు అలా అలా చిన్నచిన్నగా పనులు చేసుకుంటూ వెళ్లాలి అనుకున్నారు. అయితే జన వనరుల శాఖలో 25 శాతం లోపు జరిగిన అభివృద్ధి పనులను వెంటనే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలకు ఈ ఆదేశాలు వర్థిస్తాయని ఆంధ్రప్రదేశ్ జన వనరుల శాఖ స్పష్టం చేసింది.

Government orders to completely stop the work that has just started in the Human Resource Department

అందులో సీఎం నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలతో సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో సుమారు రూ. 385 కోట్ల విలువ చేసే 13 పనులు ప్రశ్నార్థకంగా మారాయి. గత వైసీపీ ప్రభుత్వం ఈ పనులకు అనుమతి ఇచ్చింది. 25 శాతం పైన పనులు పూర్తి అయి ఉంటే ఆ పనులు కొనసాగించాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆదేశాలు జరిగేది.

25 శాతం లోపు పూర్తికాని పనులను వెంటనే నిలిపివేయాలని జన వనరుల శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు 10 శాతం పనులకే పరిమితం అయి ఉంటే ఆ పనులు వెంటనే నిలిపివేసి ఆ నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం దెబ్బతో 25 శాతం పూర్తి కాని పనులకు చెక్ పెడుతూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Government orders to completely stop the work that has just started in the Human Resource Department

సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోని చాలా నియోజకవర్గాలలో 10 శాతం వరకు జరిగిన పనులు నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంతో పాటు రోజా నియోజక వర్గం నగిరి, కార్వేటినగరం, విజయపురం, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గంలో కొన్ని పనులు ఆగిపోయాయి. సంబంధిత అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదిక వచ్చిన తర్వాత ఆ పనుల మళ్ళీ ప్రారంభిస్తామని జన వనరుల శాఖ సీనియర్ అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+