టీడీపీకి గవర్నర్ పదవి, దక్కేదెవరికి- చంద్రబాబు ఛాయిస్..!!
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఏపీలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలోనూ కీలకంగా మారారు. కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. ఏపీ మంత్రివర్గంలోనూ బీజేపీ భాగస్వామి అయింది. ఇదే సమయంలో కేంద్రంలోని ఎన్డీఏలో ముఖ్య భాగస్వామిగా ఉన్న టీడీపీకి గవర్నర్ పదవి ఇచ్చేందుకు బీజేపీ నాయకత్వం అంగీకరించింది. ఎవరికి ఈ పదవి విషయంలో చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారుతోంది.
గవర్నర్ పదవి ఆఫర్
కేంద్రం నుంచి టీడీపీకి ఆఫర్ అందింది. కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారం తరువాత కొందరికి గవర్నర్ పదవుల పైన కేంద్రంలో కసరత్తు మొదలైంది. అందులో భాగంగా ప్రధాన భాగస్వామ్య పార్టీగా ఉన్న టీడీపీకి ఒక గవర్నర్ పదవి ఇవ్వాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో..టీడీపీ నుంచి పేరు సూచించాలని చంద్రబాబును కోరినట్లు సమాచారం. టీడీపీ నుంచి ఎవరికి చంద్రబాబు గవర్నర్ పేరు సూచిస్తారనేది పార్టీలో చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి ఇద్దరి పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు ఛాయిస్
రేసులో సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల ఉన్నట్లు సమాచారం. ఈ ఇద్దరిలో ఒకరి పేరును చంద్రబాబు ఎంపిక చేసే అవకాశం ఉంది. అశోక్ గజపతి రాజు, యనమల తొలి నుంచి టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుకు తోడుగా నిలిచారు. ఇద్దరూ అసెంబ్లీ స్పీకర్లుగా..ఆర్దిక మంత్రులుగా వ్యవహరించారు. అశోక్ గజపతి రాజు కేంద్రంలోనూ టీడీపీ మంత్రిగా పని చేసారు. ప్రస్తుత ప్రభుత్వం లో ఇద్దరికీ ప్రాతినిధ్యం లేదు. ఇద్దరి కుమార్తెలు టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి ఇస్తే..యనమలకు రాజ్యసభ అకవాశం దక్కుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

ఎవరికి దక్కేను
2014లో నాడు ఎన్డీఏలోనూ టీడీపీ భాగస్వామిగా ఉంది. అప్పుడు కూడా ఇదే రకంగా టీడీపీకి గవర్నర్ పదవి పైన ఆఫర్ అందింది. ఆ సమయంలో మోత్కుపల్లికి గవర్నర్ పదవి దక్కుతుందనే ప్రచారం సాగింది .కానీ, టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు రావటంతో ఆ పదవి దక్కలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి గత పదేళ్ల కాలంలో విద్యాసాగర రావు, బండారు దత్తాత్రేయ, కంభంపాటి హరిబాబు, ఇంద్రసేనా రెడ్డికి గవర్నర్ పదవు లు దక్కాయి. ఇక, ఇప్పుడు టీడీపీ నుంచి చంద్రబాబు అధికారికంగా ఎవరి పేరు ఖరారు చేస్తారనేది చూడాల్సి ఉంది. చంద్రబాబు పార్టీలో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications