చంద్రబాబు, పవన్ ను ఫిక్స్ చేస్తున్న జోగయ్య..!!
మరోసారి హరిరామ జోగయ్య తెర మీదకు వచ్చారు. ఎన్నికల ముందు పవన్ కు వరుస లేఖలతో జోగయ్య పలు డిమాండ్లు చేసారు. పవన్ తీసుకున్న 21 సీట్ల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జోగయ్య మళ్లీ లేఖలు మొదలు పెట్టారు. ఈ సారి సీఎం చంద్రబాబు..పవన్ కు కలిసి లేఖ రాసారు. కాపు రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావిస్తూ హరిరామ జోగయ్య రాసిన లేఖ రాజకీయంగా సంచలనంగా మారుతోంది.
జోగయ్య లేఖతో
హరిరామ జోగయ్య మరోసారి కాపు రిజర్వేషన్ పైన లేఖ రాసారు. కాపులకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్య లేఖ రాశారు. కాపులకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని బ్రిటీష్ కాలం నుంచి డిమాండ్ చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ 10 శాతం కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గతంలో టీడీపీ ప్రభుత్వం ఆమోదించిందన్నారు.

కాపు రిజర్వేషన్లపై
వైసీపీ ప్రభుత్వంలో జగన్ కాపుల రిజర్వేషన్ అమలు చేయకుండా నిలిపివేశారన్నారు. కాపులకు రిజర్వేషన్ వ్యవహారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారని తెలిపారు. తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించాలంటూ కాపు సంక్షేమ సేన అనేక ఉద్యమాలు చేసిందని హరిరామ జోగయ్య తెలిపారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ కాపు సంక్షేమ సేన రాష్ట్ర న్యాయస్థానంలో పిటిషన్ సైతం వేసిందన్నారు.
సీఎం, డిప్యూటీ స్పందిస్తారా
కాపులకు రిజర్వేషన్ కల్పించడానికి వైసీపీ ప్రభుత్వం విముఖత తెలుపుతూ న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేసిందన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కాపు రిజర్వేషన్ పై సానుకూలంగా స్పందిస్తూ న్యాయస్థానంలో కొత్త ఆఫిడివిట్ దాఖలు చేయాలని కోరుతున్నామని హరిరామ జోగయ్య తెలిపారు. త్వరలో కాపు రిజర్వేషన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications