Harsh Sai VS Jaffar: కన్నీళ్లు పెట్టుకున్న హర్షసాయి.. జాఫర్ భయ్యా ఇంత పనిచేశాడేంటి..?

Harsh Sai VS Jaffar: హర్షసాయి.. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండేవారికి పరిచయం అవసరం లేని పేరు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇతర ప్రాంతాల్లో ఆయన్ను చాలా మంది ఇట్టే గుర్తుపడతారు. అతడిని చూస్తే ఒక కంటెంట్ క్రియేటర్ కన్నా అభినవ కర్ణుడుగా భావిస్తారు ఫ్యాన్స్. అతను చేస్తున్నది చిన్న సాయమే అయినా.. అది అక్షరాలా అవసరమైన వారిచే చేరుతుందని మార్కెట్ టాక్. హిస్టరీలో తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చిన హర్షసాయి.. అతని మదిలోని చాలా విషయాలను పంచుకున్నారు.

జాఫర్ ఫేస్ టూ ఫేస్..

జాఫర్ ఫేస్ టూ ఫేస్..

జర్నలిస్ట్ జాఫర్ కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూలు చేయటంలో దిట్ట అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే హర్షసాయి చేస్తున్న సాయం ఎంత వరకు నిజం..? లబ్ధిదారుల ఎంపిక ఎలా ఉంటుంది..? అసలు హర్షసాయి ఇలా ఎందుకు చేస్తున్నాడు..? ఇదంతా పబ్లిసిటీ కోసమేనా అనే కోణంలో జాఫర్.. 'ఆపరేషన్ హర్షసాయి' అనే పేరుతో చేసిన ఒక స్ట్రింగ్ ఆపరేషన్ యూట్యూబ్ లో ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ ఇంటర్వ్యూలో జాఫర్ ప్రశ్నలకు లాక్ కాకుండా హర్షసాయి సూటిగా చెప్పిన జవాబులు భాణాల్లా ఫ్యాన్స్ గుండెల్లో గుచ్చుకున్నాయి.

సాయం పొందిన వారు మాట..

సాయం పొందిన వారు మాట..

హర్షసాయి సాయం పొందిన వారు సామాన్యులు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే చిన్నచిన్న కష్టాల్లో ఉన్నవారే. జాఫర్ వారందరినీ కలిసి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందుకోసం హర్షసాయి టీం నుంచి సాయం పొందిన వారి వివరాలను అడిగి తీసుకున్నారు. జాఫర్ తో మాట్లాడిన బార్బర్.. తమకు ఇల్లు కూడా లేదని, సాయి చాలా సాయం చేశారని అన్నారు. హర్షసాయిని చెడ్డగా చూపించాలని చూస్తే తాము అస్సలు ఊరుకోమంటూ హెచ్చరించాడు కూడా. అలా ఫీజులు చెల్లించలేని పిల్లలు, చిన్న టీవీ, ఫ్రిజ్ కావాలనుకునే సామాన్యులు, చెప్పులు కుట్టే వ్యక్తి, ఇస్త్రీ చేసుకునే కుటుంబం.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది.

పంచిపెట్టడానికి ఆదాయం ఏంటి..?

పంచిపెట్టడానికి ఆదాయం ఏంటి..?

ఇంత మందికి సాయం చేసేందుకు డబ్బులెక్కడి నుంచి వస్తాయని జాఫర్ అడిగిన ప్రశ్నకు సాయి మంచి సమాదానం ఇచ్చాడు. తానొక యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లనని. తన వీడియోలు, ప్రమోషన్ల నుంచి వచ్చే ఆదాయంలో కొంత ఛారిటీ చేస్తున్నానని తెలిపాడు. ఇందులో దాచాల్సిన విషయం ఏమీ లేదని.. తనకు వచ్చినదానిలో కొంత సమాజంలో అవసరం ఉన్నవారికి తిరిగి ఇస్తున్నాని సూటిగా బదులిచ్చాడు.

రాజకీయాల్లోకి వచ్చేందుకు పబ్లిసిటీనా..?

రాజకీయాల్లోకి వచ్చేందుకు పబ్లిసిటీనా..?

రాజకీయాల్లోకి వస్తారా.. అందుకే ఈ పబ్లిసిటీనా అని జాఫర్ అడిగిన ప్రశ్నకు తనకు అలాంటి ప్లాన్స్ లేవని చెప్పాడు. తన ఫాలోవర్స్ వల్లే తనకు ఎక్కువ గుర్తింపు వచ్చినట్లు వెల్లడించాడు. బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి తాను పెద్దయ్యాక హర్షసాయిలా పదిమందికి సాయం చేయాలనుకుంటున్నా అని చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. తనను చూసి పదిమంది ఇలా సమాజంలో మారటం తనకు సంతోషాని ఇస్తుందని అన్నాడు.

తల్లిని గుర్తు చేసుకుని.. అలా..

తల్లిని గుర్తు చేసుకుని.. అలా..

తనకు సాయం చేయాలనే గుణాన్ని చిన్నప్పటి నుంచి తల్లి అలవరిచిందని హర్షసాయి వెల్లడించాడు. ఈ క్రమంలో తన ఎనిమిదేళ్ల వయస్సులో తల్లని కోల్పోయిన విషయం గుర్తుకు రావటంతో హర్ష కళ్లలో నీళ్లు తిరిగాయి. జాఫర్ భయ్యా సైతం కంటతడి పెట్టుకున్నారు. దీనిపై మరింత లోతుగా ప్రశ్నించే ప్రయత్నం జాఫర్ చేసినా.. దీనిని ఇక్కడితో నిలిపేద్దా, ఈ విషయంపై డిస్కషన్ వద్దని సాయి సున్నితంగా చెప్పారు.

నిజంగా అవసరమైనవారికి సాయం చేసేందుకు తన టీమ్ నిరంతరం సర్వేలు చేస్తుందని.. తాను మరింత మందికి సాయం చేసేందుకు ఇతర మార్గాలను సైతం పరిశీలిస్తానని చివరిగా హర్షసాయి చెబుతూ ఇంటర్వ్యూను ముగించాడు. ప్రస్తుతం ఇది పెద్ద సంచలనంగా మారింది. ఫ్యాన్స్ సైతం దీనిపై సానుకూలంగా స్పందిస్తున్నారు.

Photo Credits: Itlu Mee Jaffar YouTube Channel

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+