Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు జన్మదినం: టార్గెట్ 2024- నేడే తొలి అడుగు : టార్గెట్ జగన్ -సంక్షోభాన్ని అవకాశంగా..!!

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు జన్మదినం నేడు. ఈ రోజున ఆయన 73వ ఏట అడుగు పెడుతున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం.. 14 ఏళ్లుగా సీఎంగా పని చేసిన రికార్డు.. 13 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా కీలక పాత్ర. రాజకీయంగా ఎన్నో విపత్కర పరిస్థితులను అధిగమించిన చంద్రబాబుకు ఇప్పుడు 2024 ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఇన్నాళ్ల రాజకీయ జీవితం.. పార్టీ భవిష్యత్ కు ఈ ఎన్నికలే దిక్సూచీ నిలవనున్నాయి. రాజకీయ చాణక్యుడిగా.. నడిచే పొలిటికల్ లైబ్రరీ గా చంద్రబాబు ఖ్యాతి దక్కించుకున్నారు. ఈ రోజున 73వ జన్మదినం జరుపుకుంటున్న చంద్రబాబు.. నేటి నుంచే 2024 ఎన్నికల కోసం తొలి అడుగు వేస్తున్నారు.

ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ

ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ


నాడు ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ పాదయాత్ర చేసి 2014లో అధికారంలోకి వచ్చిన ఆయన...మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించారు. ఈ రోజు నుంచే అందుకు ముహూర్తంగా ఖరారు చేసారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఎన్నికల వరకు జనం మధ్యే ఉండాలని భావిస్తున్న ఆయన... ఆ ప్రక్రియకు ఈ రోజే నాంది పలుకుతున్నారు. మహానాడు తర్వాత 15 రోజులకో జిల్లాలో పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారా వారి పల్లెలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన చంద్రబాబు ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకొన్నారు. విద్యార్ధి నాయకుడిగా రాజకీయ రంగంలో ప్రవేశించి.. సమర్ధ వంతమైన నాయకత్వ లక్షణాలతో టీడీపీ అధినేతగా ఎదిగారు. ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేసిన కేంద్రం పైన పోరాటంలో అందరినీ ఒకే తాటి మీదకు తెచ్చి..నాటి నుంచే ఆయన తన సత్తా చాటారు. ఇక, అప్పటి నుంచి టీడీపీలో సమర్ధవంతమైన నేతగా గుర్తింపు దక్కించుకున్నారు.

ఎన్నో సంక్షోభాలు - మరెన్నో ఆటుపోట్లు

ఎన్నో సంక్షోభాలు - మరెన్నో ఆటుపోట్లు


ఎన్టీఆర్ తో కలిసి నేషనల్ ఫ్రంట్ లో..ఆ తరువాత నేషనల్ ఫ్రంట్..యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాల నిర్వహణలోనూ కీలకంగా మారారు. రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం ఎంపికలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇక, రాజకీయంగా ఎన్టీఆర్ తరువాత సీఎం అయ్యే క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు నేటికి ఆయన్ను వెంటాడుతున్నాయి. ఇక, 2004..2009 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యారు. 1995 -2004 వరకు సీఎంగా చంద్రబాబు హైదరాబాద్ పైన ప్రత్యేక ముద్ర వేసారు. ఇక, రాష్ట్ర విభజన తరువాత ఆయన అనూహ్యంగా 2014 ఎన్నికల్లో రాజకీయ నిర్ణయాలను పక్కగా అమలు చేయటంతో అధికారం దక్కించుకున్నారు. కానీ, 2019 ఎన్నికల సమయంలో బీజేపీతో తెగ తెంపులు చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసారు. కానీ, చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకి ఊహించని ఎదురు దెబ్బ తగలింది. కేవలం 23 స్థానాలకే టీడీపీ పరిమితం అయింది. తన రాజకీయ ప్రత్యర్ధి వైఎస్సార్ కుమారుడు జగన్ సీఎం అయ్యారు.

నాడు వైఎస్సార్ - నేడు జగన్ తో

నాడు వైఎస్సార్ - నేడు జగన్ తో

అయినా..నాడు వైఎస్సార్.. నేడు జగన్ తో ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం చేస్తున్నారు. పార్టీ సంక్షోభంలోకి వెళ్తుందనే భావన నుంచి తిరిగి అధికారం మనదే అనే నమ్మకం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి లోకేష్ ను సైతం రాజకీయంగా వెనుక ఉండి నడిపిస్తున్నారు. ఇక, చంద్రబాబుకు వ్యక్తిగతంగా.. పార్టీ పరంగా 2024లో అధికారం దక్కించుకోవాల్సిన పరిస్థితి. దీంతో..ఆయన మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. దీనికి ఈ రోజున తన జన్మదినం నుంచే ప్రారంభం చేస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు తన పుట్టినరోజు వేడుకలను నిరాడంభరంగా పార్టీ కార్యాలయంలో జరుపుకొనున్నారు. బుధవారం పుట్టినరోజు అయినప్పటికీ నేతలతో, కార్యకర్తలతో ఆయన పా లోర్టీ కార్యాలయంలోనే అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

లక్ష్యం 2024 - నేడే తొలి అడుగు

లక్ష్యం 2024 - నేడే తొలి అడుగు

మధ్యాహ్నం 2 గంటల వరకూ చంద్రబాబు పార్టీ కార్యాలయంలోనే గడపనున్నారు. సాయంత్రం 4 గంటలకు నూజివీడు నియోజకవర్గం పరిధిలోని అడవినెక్కలంలో పర్యటించనున్నారు. స్ధానిక నేతలు చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను అడవినెక్కలంలో నిర్వహించనున్నారు. ఆతర్వాత అక్కడే ఆయన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో ముఖాముఖి కానున్నారు. ప్రజల కష్టసుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. మహానాడు ద్వారా 2024 ఎన్నికల సమరశంఖం పూరించి.. ఇక, పూర్తిగా ప్రజల్లోనే ఉండేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి చంద్రబాబు అనుభవం వర్సెస్ జగన్ అయిదేళ్ల పాలన ఇద్దరి ప్రజాభిమానం - ప్రజామోదం లక్ష్యంగా ఏపీలో 2024 ఎన్నికలు జరగనున్నాయి. ఇద్దరూ అటు ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు ఈ రోజు రాజకీయంగా ఎటువంటి ప్రకటనలు చేస్తారు..ఏరకమైన కార్యాచరణ ప్రకటిస్తారనేది పార్టీ శ్రేణుల్లో ఆసక్తి కరంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+