Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నీలిచిత్రాలు చూడాలి, వ్యభిచారం చేయాలి, లేకపోతే ఏం చేసేవాడంటే?

తన భర్త తనను వ్యభిచారం చేయాలని వేధిస్తున్నాడని బాధితురాలు గుంటూరు జిల్లా అర్బన్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. నీలిచిత్రాలు చూపించడమే కాకుండా తనతో వ్యభిచారం చేయాలని ఒత్తిడితెస్తున్నారని ఆమె ఆరోపించింది.

గుంటూరు:మాయమాటలతో ఓ యువతిని నమ్మించి వివాహం చేసుకొని ఆమెను వ్యభిచారం చేయాలని భర్త వేధిస్తున్నాడు. అంతేకాదు వ్యభిచారం చేస్తే మంచిగా బతికే అవకాశం ఉంటుందని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నిస్తున్నాడు. తనతో కలిసి నీలి చిత్రాలు చూడాలని వేధిస్తున్నాడని ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు లోని అమరావతి రోడ్డులోని రామా బిల్డింగ్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని పెళ్ళి చేసుకొంటానని కొద్ది నెలల క్రితం నెహ్రునగర్ రైల్వేగేటు ప్రాంతానికి చెందిన పెనుముచ్చు సుమన్ అతని కుటుంబసభ్యులు సంప్రదించారు.

హైద్రాబాద్ లో ఓ ప్రముఖ కంపెనీకి తాను ఏజంట్ గా పనిచేస్తున్నాని బాధితురాలి కుటుంబసభ్యులకు పరిచయం చేసుకొన్నాడు. అబ్బాయి కుటుంబసభ్యులు చెప్పిన వివరాలతో సంతృప్తి చెందిన బాధితురాలి కుటుంబం వివాహం చేసేందుకు ముందుకు వచ్చింది.

he wants to earn money with prostitution

గత ఏడాది నవంబర్ 20వ, తేదిన సుమన్ కు అమ్మాయిని ఇచ్చి వివాహం జరిపించారు.వివాహం జరిగిన నెలరోజుల తర్వాతి నుండి సుమన్ కుటుంబసభ్యుల నిజ స్వరూపం బాధితురాలికి తెలిసింది.

నీలి చిత్రాలను చూడాలిన బాధితురాలిని సుమన్ వేధించేవాడు.అంతేకాదు తన స్నేహితులు ఇంటికి వస్తారని, వారితో వ్యభిచారం చేయాలని బాధితురాలిని నిందితుడు వేధించేవాడు.

వ్యభిచారం చేస్తే డబ్బులు వస్తాయని ఈ డబ్బుతో సంతోషంగా బతికే అవకాశం ఉందని బాధితురాలిని ఒప్పించేందుకు ప్రయత్నించేవాడు.

ఇదే విషయమై బాధితురాలితో సుమన్ గొడవపెట్టుకొనేవాడు.వ్యభిచారం చేయకపోతే చంపేస్తానని ఆయన బెదిరించాడు.భార్యతో సుమన్ ఈ నెల 18వ, తేదిన గొడవపెట్టుకొన్నాడు.

తాళి తెంచేసి, పెళ్ళిఫోటోలు తీసుకొని వెళ్ళిపోయాడు. దీంతో బాధితురాలు పుట్టింటికి వెళ్ళిపోయింది.ఈ విషయమై సుమన్ కుటుంబసభ్యులను బాధితురాలి కుటుంబసభ్యులు ప్రశ్నించారు.

అయితే సుమన్ తల్లి, సోదరి బాధితురాలిపై దౌర్జన్యం చేశారు.ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+