బెదిరించి అత్యాచారం.. పదమూడేళ్లకే పెళ్లి.. వ్యభిచారం చేయమని ఒత్తిడి.. ఓ హెడ్ కానిస్టేబుల్ నిర్వాకం

కడప: ఓ కరుడుగట్టిన ఖాకీ మూడు పెళ్లిళ్లు చేసుకోవడమేకాక.. మూడో భార్యను వ్యభిచారం చేయమంటూ ఒత్తిడి చేస్తున్నాడు. అతడి వేధింపులు భరించలేని ఆమె చివరికి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసిన ఉదంతమిది.

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం... కడప జిల్లా ఓబులవారిపల్లెకు చెందిన యశోద ఏడో తరగతి చదివే సమయంలో ఆమె బంధువైన చంద్రశేఖర్ వారి ఇంటికి వస్తూ ఉండేవాడు. యశోద తండ్రి గుండెపోటుతో మరణించడంతో ఆమెకు ఏ అండా లేకుండా పోయింది.

Head Constable harassing his wife to do Prostitution

ఈ క్రమంలో యశోదను బెదిరించి చంద్రశేఖర్ ఆమెతో శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు.
అనంతరం నీకు అన్యాయం చేయనంటూ కొన్ని రోజుల తరువాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.

అయితే చంద్రశేఖర్ కు అంతకుముందే రెండు పెళ్లిళ్లు అయ్యాయని, తనను మూడో పెళ్లి చేసుకున్నాడని యశోదకు తరువాత తెలిసింది. ముగ్గురు భార్యలున్నా కూడా కానిస్టేబుల్ చంద్రశేఖర్ మరికొంతమందితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు.

ఎందుకిలా అని యశోద నిలదీస్తే ''నా ఇష్టం.. నేను 50 మందిని పెళ్లి చేసుకుంటా.. అడగడానికి నువ్వెవరివి.. అసలు నీకూ నాకూ సంబంధమే లేదు.. నీకు దిక్కున్న చోట చెప్పుకో ఫో..'' అంటూ బెదిరించాడు.

అంతేకాదు, యశోదను శారీరకంగా చిత్రహింసలు పెట్టేవాడు. వ్యభిచారం చేయమంటూ తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడు. ప్రస్తుతం చంద్రశేఖర్ ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌లోనే హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

మూడు పెళ్లిళ్లు చేసుకుని కూడా తన భర్త ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడని, తనను వ్యభిచారం చేయంటూ చిత్రహింసలు పెడుతున్నాడని, తనపై కిరోసిన్ పోసి నిప్పంటించి చంపేందుకు కూడా ప్రయత్నించాడని, తనకు రక్షణ కల్పించి, అతడ్ని కఠినంగా శిక్షించాలంటూ యశోద మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారిని కలిసి వేడుకుంది.

ఈ నేపథ్యంలో ఆ కీచక ఖాకీపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి కడప జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+