వ్యాఖ్యల కలకలం:జగన్ ఇలాకాలో బాబుకి చిరకాల ప్రత్యర్థుల తలనొప్పి
విజయవాడ: కడప జిల్లాలో వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సొంత బలం ఉంది. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఎలాగైనా కడప జిల్లాలో జగన్ ప్రాభవాన్ని దెబ్బతీయాలని చంద్రబాబు చూస్తున్నారని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే కడప జిల్లా వైసిపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు.
ఆదినారాయణ రెడ్డి చేరికను టిడిపి సీనియర్ నేత రామసుబ్బా రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఇప్పుడు జిల్లాలో, ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆదినారాయణ రెడ్డి చేరికకు తన బంధువు కేశవ రెడ్డి విద్యా సంస్థల అధినేత చిక్కుల్లో పడటం కూడా కావొచ్చుననే వాదనలు ఉన్నాయి.
ఏది ఏమైనా టిడిపిలో చేరేందుకు ఆదినారాయణ ఆసక్తితో ఉండగా, టిడిపి సీనియర్ నేత రామసుబ్బా రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గురువారం నాడు రామసుబ్బా రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తనకు గౌరవం ఉన్నంత వరకే టిడిపిలో ఉంటానని, చంద్రబాబు రాష్ట్రం కోసం ఆళోచిస్తే తాను జమ్మలమడుగు అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచిస్తానని వ్యాఖ్యానించారు.

కాగా, వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఆది నుంచి టిడిపి తరఫున ఎదుర్కొంటున్న వారిలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీశ్ రెడ్డి కాగా, మరొకరు రామసుబ్బా రెడ్డి అని చెప్పవచ్చు. రామసుబ్బా రెడ్దికి నేటికి కడప జిల్లాలో మంచి పట్టు ఉంది. పెద్ద ఎత్తున కార్యకర్తల అండ ఉంది.
పార్టీ ప్రమేయం లేకుండా ఆయన ముందుకు అడుగు వేస్తే చాలామంది ఆయన వెంట నడుస్తారని అంటారు. ఈ కారణంగానే రామసుబ్బా రెడ్డి పదవిలో లేకున్నా చంద్రబాబు వద్ద మాత్రం పలుకుబడి ఉంది. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి కారణంగా చిచ్చు రాజుకుంది. ఈ క్రమంలో రామసుబ్బా రెడ్డి పార్టీ వీడితే... కడప గడపలో టిడిపికి భారీ ఎదురు దెబ్బ తప్పదంటున్నారు.
ఇక, ఆదినారాయణ రెడ్డి అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత వైసిపిలో చేరారు. జమ్మలమడుగు నుంచి వైసిపి తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, ఇటీవల ఆయన టిడిపి వైపు చూస్తున్నారు.
అయితే రాజకీయంగా చిరకాలంగా ప్రత్యర్థిగా కొనసాగుతున్న రామసుబ్బా రెడ్డి అభ్యంతరాలతో టిడిపిలో ఆయన చేరికకు బ్రేకులు పడుతూన్నాయి. ఆదినారాయణ రెడ్డిని చేర్చుకునేందుకే చంద్రబాబు మొగ్గుచూపడంతో రామసుబ్బా రెడ్డి ఇబ్బంది పడుతున్నారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications