శృంగార మామిడి పండు?
మామిడి తొడిమ దగ్గర అంటుకొనే సొన ఉంటుంది. ఇది పూర్తిగా పోయేలా చూసుకోవాలి.
మామిడిపండ్లను చూస్తే చాలు.. నోరూరదని ఎవరికని మనలో మనమే ప్రశ్నించుకుంటాం. పండ్లన్నింటికీ మహారాజుగా పేరుపొందిన మామిడి రుచే అసలు వేరుగా ఉంటుంది. ఆరోగ్యానికి ఇది చేసే మేలు ఏ కాయా, ఏ పండూ చేయదని చెప్పవచ్చు. అయితే మీరు మామిడిని సరైన పద్ధతిలోనే తింటున్నారా? లేదంటే పండును తినటానికి సరైన పద్దతేంటని అనుమానం మీకు వచ్చిందా? మామిడిపండ్లపై ఒకరకం ఫైటిక్ ఆమ్లం ఉంటుంది. ఇది శరీరానికి తగిలితే అలర్జీ రావడం, దురద పుట్టడం.. జరగొచ్చు. అందుకే మామిడికాయలనైనా, మామిడి పండ్లనైనా శుభ్రంగా కడగడం ఎంతో ముఖ్యం.

తొడిమ దగ్గర సొన
మామిడి తొడిమ దగ్గర అంటుకొనే సొన ఉంటుంది. ఇది పూర్తిగా పోయేలా చూసుకోవాలి. దీనికి మామిడి పండ్లను నీటిలో కనీసం అరగంట నానబెట్టి, కడగడం మంచిది. దీంతో అధికంగా ఉన్న ఫైటిక్ ఆమ్లం తొలగిపోతుంది. ఆయుర్వేదం ప్రకారం భోజనంతోపాటు పండ్లను తీసుకోకూడదు. కానీ మామిడి పండ్లు దీనికి మినహాయింపునిస్తాయి. పాలతో కలిపి తీసుకుంటే ఇంకా బలంగా బలవర్థకమైన ఆహారంగా పనిచేస్తుంది. మనిషికి శృంగారం మీద ఆసక్తిని పెంచుతుంది. వాత, పిత్త దోషాలను తగ్గించడమే కాదు.. జీర్ణ సమస్యలు, రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్, ల్యూపస్, సోరియాసిస్, ఎర్తియోసిస్ వంటి ఆటో ఇమ్యూన్ జబ్బులు, చర్మ సమస్యలుగలవారు మామిడిపండ్లను పాలతో కలిపి తీసుకోకూడదు.

పాలతో కలిపి వీరు తీసుకోకూడదు
చర్మ సమస్యలున్నవారు ఎప్పుడూ మామిడి పండ్లను పాలతో కలిపి తీసుకోకూడదు. మామిడిలో యాంటీ ఆక్సిడెంట్ల గుణాలతో కూడిన గ్యాలటానిన్లు, మ్యాంగిఫెరిన్ వంటి వృక్ష రసాయనాటు ఎక్కువగా ఉంటాయి. ఇవి విశృంఖల కణాల దుష్ప్రభావాలను అడ్డుకుంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నప్పటికీ తొక్కతోపాటు తింటేనే ఈ ప్రయోజనాలన్నీ అందుతాయి. ఎందుకంటే ఇవి తొక్కకిందే ఉంటాయి కాబట్టి. విసర్జన సాఫీగా అయ్యేలా మామిడిలో విటమిన్ సి, విటమిన్ ఏ దండిగా ఉంటాయి. కొలాజెన్ ఏర్పడటానికి ఉపయోగపడుతుంది.

వృద్ధాప్యాన్ని నివారిస్తుంది?
చర్మం బిగుతుగా ఉండటానికి తోడ్పడే కొలాజెన్ ఏర్పడటంలో పాలు పంచుకోవడమేకాదు.. అంటే ఇవి చర్మం నిగనిగకూ తోడ్పడతాయని, మనిషిలో వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయనే విషం తెలిసిందే. పండ్లలో రారాజైన మామిడి రసం వేడి మంటను నివారిపస్తుంది. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు. ఎండాకాలంలో వడదెబ్బను నివారించడానికి ఇది సహజమైన నివారణ. మామిడి పండు రక్తహీనతను నివారిస్తుంది. మామిడిపండులో శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచే బిటాకెరోటిన్ అనే పదార్థం సమృద్దిగా ఉండటంతో.. మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని బలోపేతం చేస్తుంది












Click it and Unblock the Notifications