ఏపీలో వడగాడ్పుల జోరు- రుతు పవనాల రాకపై వాతావరణ కేంద్రం క్లారిటీ..!!

అమరావతి: దక్షిణాదిన రుతు పవనాలు క్రమంగా విస్తరిస్తోన్నాయి. కర్ణాటక, తమిళనాడు తీర ప్రాంతాల్లో ఎండ తీవ్రత తగ్గింది. అడపా దడపా వర్షాలు పడుతున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుఫాన్ ప్రభావం వల్ల మహారాష్ట్ర, గుజరాత్‌లల్లో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఆయా రాష్ట్రాల్లోని తీర ప్రాంత జిల్లాల్లో ఉష్ణోగ్రత చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గుముఖం పట్టింది.

ఏపీ, తెలంగాణకు మాత్రం ఇప్పట్లో ఎండ నుంచి ఊరట దక్కేలా కనిపించట్లేదు. ఏపీలో ఒకరోజు, తెలంగాణలో రెండు రోజుల పాటు వడగాడ్పులు కొనసాగుతాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎండ తీవ్రతకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాయవ్య, పశ్చిమ దిశల నుంచి వేడిగాలులు వీస్తుండటంతో ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు.

Heat wave conditions are prevail for 2 days in Andhra and Telangana

దక్షిణ ఛత్తీస్‌గఢ్‌పై ఉపరితల ద్రోణి ఆవరించి ఉండటం వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం సైంటిస్ట్ శ్రావణి తెలిపారు. వాయవ్య, నైరుతి గత 24 గంటలుగా రాష్ట్రవ్యాప్తంగా నైరుతి, వాయవ్య దిశల నుంచి గాలులు వీస్తోండటం వల్ల తెలంగాణ ఉత్తర జిల్లాల్లో వడగాడ్పులు ప్రభావం ఉంటుందని తెలిపారు.

ప్రత్యేకించి- భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వీటి తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేసినట్లు శ్రావణి చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, హన్మకొండల్లోనూ ఉష్ణోగ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. సాధారణంగా జూన్ రెండో వారంలో పగటి ఉష్ణోగ్రత 36 నుంచి 38 డిగ్రీల వరకు నమోదవుతుంటుందని, ఈ సారి 40 నుంచి 41 డిగ్రీల వరకు ఉంటుందని వివరించారు.

హైదరాబాద్‌లో 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత రికార్డవుతుందని పేర్కొన్నారు. ఏపీలో వడగాడ్పుల తీవ్రత 24 గంటల వరకు ఉంటుందని, అనంతరం వాతావరణం చల్లగా మారుతుందని శ్రావణి తెలిపారు. గురు/శుక్ర వారాల్లో ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

వచ్చే 48 గంటల తరువాత ఏపీకి రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలు అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో గురు/శుక్రవారాల్లో రుతు పవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేసినట్లు శ్రావణి చెప్పారు. తెలంగాణకు విస్తరించడానికి ఒక రోజు పడుతుందని అన్నారు. మధ్య తెలంగాణలో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+