ఏపీ వాసులకు అలర్ట్ - అప్రమత్తంగా ఉండాల్సిందే..!!

ఏపీ ప్రజలకు రెడ్ అలర్ట్. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక. ఈ రోజు (బుధవారం) ఎండల తీవ్రత..వడ గాలులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. గడిచిన రెండు రోజులుగా రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు మండలాల్లో వడ గాలుల తీవ్రత పెరిగింది. దీంతో, అత్యవసరం అయితే ప్రజలు ఎండ సమయంలో బయటకు వెళ్లాలని..తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మండుతున్న ఎండలకు వడగాలులు తోడవ్వడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. పలు ప్రాంతాల్లో మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కర్నూలు, నంధ్యాల ప్రాంతాల్లో 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనకాపల్లి 5, కాకినాడ 3 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. అల్లూరి 3, అనకాపల్లి 7,ఏలూరు 4, కాకినాడ 3, కృష్ణా 2, ఎన్టీఆర్‌, పల్నాడు, విశాఖ, విజయనగరం లో ఒక్కొక్క మండలంలో వడగాల్పులు నమోదయ్యాయి. ఇదే సమయంలో వడగాలులు ఉక్కిరి బిక్కరి చేస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు మండలాల్లో వేడి, వడగాలుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.

Heat Waves

ఆ రోజు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ప్రధానంగా 4 మండలాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాకినాడ జిల్లా కోటనందూరు, అనకాపల్లి జిల్లా గొలుగొండ, నాతవరం, మండలాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతోపాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించించింది. 126 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటతాయని, వడగాలుల ప్రభావం ఉండే అవకాశం ఉంది.

Heat Waves

కాగా, మంగళవారం అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలో అత్యధికంగా 42.9 డిగ్రీలు, అనకాపల్లి మండల కేంద్రం, కోటవురట్లలో 42.4 డిగ్రీలు, మాకవరపాలెంలో 42.5, కాకినాడ జిల్లా తొండంగిలో 41.8, తునిలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక..అల్లూరి జిల్లా 9, అనకాపల్లి 14, తూర్పు గోదావరి 16, ఏలూరు 5, గుంటూరు 6, కాకినాడ 12, కోనసీమ 1, కృష్ణా 6, ఎన్టీఆర్‌ 14, పల్నాడు 1, మన్యం 11, శ్రీకాకుళం 7, విశాఖ 3, విజయనగరం 18, వైయస్సార్‌ 3 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేసారు. ఎండల తీవ్రత, వడగాలుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+