ఈ ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు వాయిదా- ఎన్నికల సంఘం ఆదేశాలు..!!
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాల్టీ లు, 3,186 వార్డులకు సంబంధించి ఓట్లను లెక్కింపు జరగనుంది. ఇందు కోసం రాష్ట్రవ్యాప్తంగా 138 కేంద్రాలను ఏర్పాటు చేసారు. అయితే, మురుసు తుఫాను ప్రభావం కౌంటింగ్ ప్రక్రియ పైన కనిపిస్తోంది పలు ప్రాంతాల్లో కౌంటింగ్ ను వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కౌంటింగ్ ప్రక్రియలో 47, 817 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. అయితే, మురసు తుపాను ప్రభావం కౌంటింగ్‌పై పడింది. భారీ వర్షాల కారణంగా ఒంగోలు కార్పొరేషన్, అద్దంకి, చీమకుర్తి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ వాయిదా పడింది. ఈ మేరకు కౌంటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. తుపాను ప్రభావం తగ్గిన తరువాత కౌంటింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా.. భారీ వర్షాల కారణంగా చీరాలలో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు కౌంటింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుందని సంబంధిత అధికారులు ప్రకటించారు. విజయవాడలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షం కారణంగా ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోలేదు.

కౌంటింగ్ పై తుఫాను ఎఫెక్ట్.. వాయిదా
కాగా.. పలు ప్రాంతాల్లో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభిస్తున్నారు. అటు.. మురుసు తుఫాను తీర ప్రాంత జిల్లాల పైన ఎక్కువ ప్రభావం చూపుతోంది. జిల్లా అధికార యంత్రాంగం తుఫాను సమీక్ష.. సహాయక చర్యల పైన ఫోకస్ చేసింది. దీంతో.. ఉమ్మడి ప్రకాశం జిల్లా పైన ప్రభావం ఎక్కువగా ఉండటంతో అక్కడ కౌంటింగ్ సమయం వాయిదా వేసారు. మిగిలిన ప్రాంతాల్లో కొంత ఆలస్యంగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అధికార యంత్రాంగం తుఫాను పైన ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఎన్నికల సంఘానికి సమాచారం అందిస్తోంది. దీనికి అనుగుణంగా ఎన్నికల సంఘం కౌంటింగ్ పైన నిర్ణయాలు వెల్లడిస్తోంది. ఇక.. కౌంటింగ్ ప్రక్రియ లో ప్రస్తుతం పోస్టలం బ్యాలెట్ లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం తరువాత ఫలితాలు వరుసగా వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications
