పవన్ పై అల్లు అర్జున్ ఆసక్తి కర వ్యాఖ్యలు - వైరల్..!!

ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కూటమి విజయం వెనుక పవన్ కీలక పాత్ర పోషించారు. పిఠాపురంలో పవన్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. తన సమీప వైసీపీ అభ్యర్ధి వంగా గీతపై 70 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా ఓటు శాతం పెంచుకున్న జనసేనాని.. ఈసారి ఏపీ అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు సిద్దమయ్యారు. ఈ సమయంలోనే పవన్ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ విజయంపై అల్లు అర్జున్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్వీట్ లో..సంవత్సరాల తరబడి ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి, అంకితభావం, నిబద్దత ఎలప్పుడూ తన హృదయాన్ని హత్తుకున్నాయి. ప్రజాసేవలో మీ సరికొత్త ప్రయాణం మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నా..అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముందు రోజున అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్ది శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా నిలిచారు.

pawan kalyan allu arjun

అల్లు అర్జున్ నాడు నంద్యాలలో వైసీపీ అభ్యర్ది నివాసానికి వెళ్లటం పైన రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఒక దశలో నాగబాబు సైతం పరోక్షంగా అల్లు అర్జున్ గురించి చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఆ తరువాత నాగబాబు ట్వీట్ డిలేట్ చేసారు. ఇక..తరువాత సోషల్ మీడియాలో చర్చ జరిగింది. పవన్ కు మద్దతుగా మెగా కుటుంబ సభ్యులు పిఠాపురంలో ప్రచారం చేసారు. భారీ మెజార్టీ తో పవన్ గెలుస్తారనే అంచనాలు ఉన్నాయి. పవన్ భారీ మెజార్టీతో గెలవటంతో పాటుగా..కూటమి గెలుపులో కీలకంగా మారటంతో ఇప్పుడు పవన్ ను పలువురు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+