బ్రహ్మానందం ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఇంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. సాయంత్రం ఆయన హైదరాబాద్ లోని బ్రహ్మానందం ఇంటికి వెళ్లారు. ఆయన రెండో కుమారుడు సిద్ధార్థ్ కు కొద్దిరోజుల క్రితం వివాహం జరిగింది. ఈ సందర్భంగా సిద్ధార్థ్-ఐశ్వర్య దంపతులకు అర్జున్ శుభాకాంక్షలు తెలియజేయడంతోపాటు కుటుంబ సభ్యులతో కొద్దిసేపు సరదాగా గడిపారు.
జాతీయ ఉత్తమ నటుడిగా బన్నీ అవార్డు గెలుచుకోవడంపై బ్రహ్మానందం సంతోషాన్ని వ్యక్తం చేశారు. పుష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. మరోవైపు బన్నీకి జాతీయ అవార్డు రావడంపై నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, మయాంక్ హర్షం వ్యక్తం చేయడంతోపాటు ప్రత్యేకంగా అభినందించారు.

అల్లు అర్జున్ కు బ్రహ్మానందంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. గతంలో ఓసారి బ్రహ్మీ తాను ప్రత్యేకంగా చిత్రించిన వెంకటేశ్వరస్వామి ఫొటోను బన్నీకి బహుమతిగా అందించారు. ఆయన రెండో కుమారుడు సిద్ధార్థ్ వివాహం ఆగస్టు 19న హైదరాబాద్ లో వైభవోపేతంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజురయ్యరు. వ్యక్తిత కారణాలవల్ల అల్లు అర్జున్ హాజరుకాలేకపోయారు. తాజాగా నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
పుష్ప చిత్రంలో ప్రదర్శించిన నటనకు అల్లు అర్జున్ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. 69 సంవత్సరాల తర్వాత తొలిసారిగా తెలుగు నటుడు జాతీయ అవార్డును కైవసం చేసుకున్నారు. దీనిపై అన్నివర్గాల నుంచి బన్నీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications