ఆ మూడు సినిమాలు నా కెరీర్ ను మలుపు తిప్పాయి
స్టార్ కథానాయకుడు ఘట్టమనేని మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. సినిమా కథ బాగున్నా, బాగోపోయినా తనకున్న స్టార్ ఇమేజ్ తో, ఛరిష్మాతో ఆ సినిమాను అవలీలగా గట్టెక్కించగలడు. అందుకు ఉదాహరణ.. గుంటూరు కారం సినిమా. ఇటీవలే విడుదలైన ఆ సినిమా దర్శకుడి పనితీరువల్ల ఆకట్టుకోలేకపోయినప్పటికీ మహేష్ బాబు మాత్రం తనకున్న క్రేజ్ ద్వారా దాదాపు రూ.230 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిపెట్టాడు. పాన్ ఇండియా హీరోలతో సమానంగా ఇమేజ్, అభిమాన బలం అతని సొంతం.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రిన్స్ మాట్లాడుతూ తన కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాల గురించి తెలిపారు. తన కెరీర్ లో బాగా ప్రభావితం చేసిన సినిమాలు మురారి, పోకిరి, శ్రీమంతుడు అని చెప్పారు. ఈ సినిమాలు ఆడియన్స్ ను బాగా దగ్గర చేశాయని, నైతిక అంశాలు ఉండే కథలను ఎంచుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తానని, తాను చేసే పాత్రలు, వాటి స్వభావాన్ని అభిమానులకు తెలియజేసేలా చూసుకుంటానన్నారు.

ఇన్ని సంవత్సరాల తన సినీ ప్రయాణంలో సినిమా విజయాల ద్వారా తన ఆలోచనా సరళి కూడా మారిందని, బాక్సాఫీస్ కలెక్షన్లు ఎంత ముఖ్యమో.. ఆ సినిమా ఆడియన్స్ పై ఎంత ప్రభావం చూపాలనేది కూడా ప్రధానమన్నారు. అదే సినిమా విజయానికి ప్రధాన కారణమవుతోందన్నారు. సినిమాలో ప్రతి పాత్రకు నెగటివ్ ఛాయలుంటాయని, ప్రతి పాత్ర ఏదో ఒక నైతిక విషయాన్ని అంతర్లీనంగా చెబుతుంటుందన్నారు. సినిమాలో ఒక పాత్రను తాను అంగీకరించిన తర్వాత ఆ క్యారెక్టరైజేషన్ కు లొంగిపోతానని, దర్శకుడు చెప్పినవిధంగా చేసుకుంటూ వెళతానన్నారు. ఆ పాత్రలకు గ్రే షేడ్స్ ఉన్నప్పటికీ, ఏది తప్పు? ఏది ఒప్పు? అనే పరిణతిని ప్రేక్షకులు సాధించారన్నారు.












Click it and Unblock the Notifications