మోహన్ బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మనోజ్-తాజాగా ఇదే..!

తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ కుటుంబంగా చెప్పుకుంటే మంచు కుటుంబంలో విభేదాలు తారా స్దాయికి చేరాయి. ఇప్పటికే తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్న ఆయన తనయుడు మంచు మనోజ్.. హైదరాబాద్ లోని ఇంటికి వెళ్లిన సందర్భంగా ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత తాజాగా సంక్రాంతి సందర్బంగా మోహన్ బాబు తల్లి తండ్రుల సమాధుల్ని దర్శించుకోవడం పేరుతో మనోజ్ మరో రచ్చకు తెరదీశారు.

రంగంపేటలోని మోహన్ బాబు వర్శిటీ ప్రాంగంణంలో ఉన్న ఆయన తల్లి తండ్రుల సమాధుల్ని దర్శించుకునేందుకు మంచు మనోజ్ తన భార్య మౌనికా రెడ్డితో కలిసి వెళ్లారు. దీంతో మోహన్ బాబు వర్సిటీ సిబ్బంది , బౌన్సర్లు అడ్డుకున్నారు. దీంతో తన బౌన్సర్ల సాయంతో ఎలాగైనా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో పోలీసులు ఆయన లోపలికి వెళ్లకుండా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చూపించారు. కానీ తన తాతల సమాధుల వద్దకు వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. చివరికి పోలీసులు మనోజ్ దంపతుల్ని లోపలికి అనుమతించారు.

hero Manchu manoj complains against mohan babu university staff in chandragiri PS

దీంతో గొడవ సద్దుమణిగినట్లే అని అంతా భావిస్తున్న తరుణంలో ఇవాళ చంద్రగిరి పీఎస్ కు వెళ్లిన మంచు మనోజ్.. మోహన్ బాబు యూనివర్శిటీ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. మంచు మనోజ్ అనుచరులు పళణి, వినాయక పేర్లతో ఎంబియు సిబ్బంది హేమాద్రి నాయుడు, కిరణ్ పై ఈ ఫిర్యాదు చేయించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మనోజ్.. తమ కుటుంబంలో జరుగుతున్న ఘటనలు బాధాకరం అన్నారు. తనకు దేవుడు ఇచ్చిన వరం అభిమానులని, ఎనిమిదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న నాపై అభిమానులు ప్రేమ చూపిస్తున్నారని గుర్తుచేసుకున్నారు.

తనతో సమస్య ఉంటే తనతో మాట్లాడాలని, తాను ఎక్కడికి పారిపోలేదని మనోజ్ తెలిపారు.. తన వాళ్ల వాహనాల్లో చక్కెర పోయడం, కట్టిన బ్యానర్లు తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. డబ్బులిచ్చి, కిరాయిలకు మనుఘలను పెట్టికుని తిరిగే వాడిని కాదన్నారు. పండుగ సమయంలో తతన వాళ్లను పిలిపించి మనోజ్ తో ఉండకూడదని బెదిరించారని ఆరోపించారు.
క్యాంపస్ సమస్యలు గురించి చర్చించుకుంటే సరిపోతుందన్నారు.

నలుగురు పెద్ద మనుషుల్ని పిలిచి అన్నదమ్ములతో మాట్లాడితే సరిపోయే చిన్న విషయమని, సిఎం ఇంటికి వెళ్లి నారా లోకేష్'ను కలవడం కేవలం పరామర్శించడానికే అన్నారు. పండుగకు ఇంటికి వస్తే గేట్లు వేశారని, తాత, అమ్మమ్మ సమాధులకు నివాళులు అర్పించేందుకు వెళితే అడ్డుకున్నారని మనోజ్ ఆరోపించారు. తన వాళ్లపై దాడి చేయడమే కాకుండా గేట్లు దూకి వెళ్లానని ఫిర్యాదు చేశారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+